క్షమించండి నాకు చాలా బాధగా ఉంది.. కన్నీళ్లు పెట్టుకున్న డెన్మార్క్‌ ప్రధాని.. అసలు కారణం ఏంటంటే..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. మరోవైపు డెన్మార్క్‌, అమెరికా సహా పలు దేశాల్లో మింక్ అనే జంతువు నుంచి కొత్తరకం కరోనా వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది

క్షమించండి నాకు చాలా బాధగా ఉంది.. కన్నీళ్లు పెట్టుకున్న డెన్మార్క్‌ ప్రధాని.. అసలు కారణం ఏంటంటే..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 27, 2020 | 9:17 AM

Mette Frederiksen emotional: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. మరోవైపు డెన్మార్క్‌, అమెరికా సహా పలు దేశాల్లో మింక్ అనే జంతువు నుంచి కొత్తరకం కరోనా వ్యాపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ క్రమంలో డెన్మార్క్‌ ప్రభుత్వం మింక్‌లను చంపేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెలలో 1.7కోట్ల మింక్‌లను చంపేయాలని ఆ దేశ ప్రధాని మెట్టె ఫ్రెడ్రిక్సన్ పార్మెంట్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆమె తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకత కూడా వచ్చింది. అయితే ఈ నిర్ణయానికి చట్టబద్ధత లేదని అంగీకరించిన మెట్టె.. పార్లమెంట్‌లో క్షమాపణ కూడా కోరారు. (నాని ‘శ్యామ్ సింగ రాయ్‌’.. మరో హీరోయిన్‌కి ఛాన్స్‌.. ఆ ఇద్దరిలో నాచురల్‌ స్టార్ ఓటు ఎవరికి..!)

ఇదిలా ఉంటే ఈ నిర్ణయం వలన ఉపాధి కోల్పోయిన మింక్‌ రైతులను ఆమె తాజాగా కలిశారు. పశ్చిమ డెన్మార్క్‌లోని కోల్డింగ్‌లో ఉన్న ఓ మింక్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన ఫ్రెడ్రిక్సన్‌.. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ”ఇది నిజంగా వారికి చాలా బాధను కలిగించే సంఘటన. క్షమించండి. నాకు కూడా. వారి జీవనాధారం కోల్పోయారు” అంటూ మెట్టె కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా చైనా, డెన్మార్క్‌, నెదర్లాండ్స్‌, పోలండ్‌లలో ఉన్ని కోసం మింక్‌లను పెంచుతూ ఉంటారు. కానీ కరోనా నేపథ్యంలో పలు చోట్ల వీటిని చంపేయడంతో.. చాలా మంది రైతులు కన్నీళ్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. (Bigg Boss 4: ఒంటరిగా కూర్చొని ఏడ్చిన అఖిల్‌.. ఓదార్చిన అరియానా, అవినాష్‌, సొహైల్)