Diaz Canel: క్యూబా… చిన్న ద్వీపం. 11 మిలియన్ల జనాభా ఉన్న దేశం. కమ్యూనిస్టు కంట్రీ. పంచదార ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. 44 దేశాల్లో ఆ దేశ డాక్టర్లు పని చేస్తున్నారు. ఆ దేశ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి ఇప్పుడు మిగుల్ డియాజ్ కనెల్ ఎంపికయ్యారు. ఆ పార్టీ కార్యదర్శి రౌల్ క్యాస్ట్రో రాజీనామా చేయడంతో కొత్త కార్యదర్శి ఎంపిక అనివార్యమైంది. ఫిడెల్ క్యాస్ట్రో తర్వాత రౌల్ క్యాస్ట్రో బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే.
అయితే క్యూబాలో దేశ అధ్యక్షుడి కంటే కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శికే విలువ ఎక్కువ. అందుకే డియాజ్ కనెల్ అధ్యక్ష బాధ్యతలతో పాటు పార్టీ కార్యదర్శిగా పని చేయాల్సి వస్తోంది. ఆయన వయసు ఇప్పుడు 60 ఏళ్లు. 2018లో క్యూబా దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డియాజ్.. ఇక కమ్యూనిస్టు పార్టీ లీడర్‌గా కూడా కీలక బాధ్యతలు వహిస్తున్నారు. 1959 నుంచి క్యూబా కమ్యూనిస్టు పార్టీకి ఫిడేల్ క్యాస్ట్రో, ఆయన సోదరుడు రౌల్ క్యాస్ట్రోలు నాయకత్వం వహించారు. అరవై ఏళ్ల తర్వాత ఆ పార్టీ ఇప్పుడు మరో కొత్త తరం నాయకుడి చేతుల్లోకి వెళ్లింది. క్యాస్ట్రో సోదరులకు, వారి ఆర్థిక విధానాలు అమలు చేయడానికి డియాజ్ నమ్మకమైన వ్యక్తి. అందుకే కొత్త రకం నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగించినట్లు రౌల్ క్యాస్ట్రో ప్రకటించారు.
కాగా, పశ్చిమ బెంగాల్ సిఎంగా పని చేసిన జ్యోతి బసు ముందుగానే పార్టీ, ముఖ్యమంత్రిగా బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అలానే క్యూబా కమ్యూనిస్టు పార్టీ బాధ్యతల నుంచి ముందుగానే తప్పుకున్నారు రౌల్ క్యాస్ట్రో. ఫిడెల్ క్యాస్ట్రో కూడా తన ఆరోగ్యం బాగుండగానే తమ్ముడికి కీలక బాధ్యతలు అప్పగించాడు. మిగతా జీవిత కాలాన్ని ప్రజా సేవకు అంకితం చేస్తూ నిరాడంబరంగా ఉన్నారు. ఇప్పుడు రౌల్ క్యాస్ట్రో అదే పని చేయనున్నారు. కాకపోతే పక్కలో బాంబులా తమ దేశానికి దగ్గరలో ఉన్న శత్రుదేశం అమెరికా ఎత్తులను కాచుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరముంది. క్యూబా పై ఆర్థికంగా అనేక ఆంక్షలు విధించింది అగ్రదేశం. అయినా సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు, కాంగో, బొలివియా, చైనా, వెనిజులా వంటి దేశాలు చమురు, గ్యాస్ వంటివి సరఫరా చేస్తూ ఆదుకున్నాయి. ఇప్పటి రష్యా కూడా అదే పని చేస్తోంది.
ఏప్రిల్ 20, 1960లో జన్మించిన మిగుల్ డియాజ్ కనెల్..ఇతని తండ్రి ఒక మెకానికల్ ప్లాంట్లో కార్మికుడు. ఆడా బెర్మాడెజ్, శాంటా క్లారాలోని మెకానికల్ ప్లాంట్ వర్కర్ మిగ్యుల్ డియాజ్-కానెల్ దంపతులకు జన్మించాడు. పితృ స్పానిష్ (అస్టురియన్) సంతతికి చెందినవాడు. అతని ముత్తాత రామోన్ డియాజ్-కానెల్. 19 వ శతాబ్దం చివరలో హవానా కోసం కాస్ట్రోపోల్, అస్టురియాస్ నుండి బయలుదేరాడు. 1982 లో సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ లాస్ విల్లాస్ నుండి ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్‌గా పట్టభద్రుడు. తరువాత క్యూబన్ విప్లవాత్మక సాయుధ దళాలలో చేరిన డియోజ్.. ఏప్రిల్ 1985 నుండి అల్మా మేటర్ వద్ద ఇంజనీరింగ్ బోధన చేశారు. నికరాగువాలో విల్లా క్లారాలో ఉన్న యంగ్ కమ్యూనిస్ట్ లీగ్ యొక్క మొదటి కార్యదర్శిగా సేవలు అందించారు. అంతర్జాతీయ మిషన్ పూర్తి ఎలక్ట్రానిక్ ఇంజినీర్ విద్యను చదివిన డియోజ్.. 2019లో క్యూబా దేశ 19వ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. కాస్ట్రో కుటుంబయేతర నుంచి తొలిసారిగా ఎన్నికైన వ్యక్తి.
రాల్ కాస్ట్రో పదవీ విరమణ చేయటంతో 605 మంది సభ్యులతో కూడిన జాతీయ అసెంబ్లీ సమావేశం జరిగింది. డియోజ్ ను అధ్యక్షుడిగా ఎన్నుకున్న నేషనల్ అసెంబ్లీ .. క్యూబా రాజకీయ నాయకుడు, కమ్యూనిస్ట్ పార్టీ మొదటి కార్యదర్శి అత్యంత సీనియర్ నేతగా క్యూబాలో స్థానం సంపాదించుకున్నారు. 2003 నుండి కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేసిన కెనెల్.. 2009-12 వరకు ఉన్నత విద్యాశాఖ మంత్రి, 2012 లో మంత్రుల మండలి (ఉప ప్రధానమంత్రి) వైస్ ప్రెసిడెంట్ పదవికి పదోన్నతి లభించింది. ఫిబ్రవరి24, 2013న కౌన్సిల్ ఆఫ్ స్టేట్ మొదటి ఉపాధ్యక్షునిగా ఎన్నిక కాగా, 2013-18 వరకు క్యూబా దేశ మొదటి ఉపాధ్యక్షుడు, ఏప్రిల్18, 2018 న కౌన్సిల్ ఆఫ్ స్టేట్ మంత్రుల మండలి అధ్యక్షుడిగా రౌల్ కాస్ట్రో తరువాత ఎంపికయ్యారు. 2018-19 వరకు కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ప్రెసిడెంట్ గా పని చేసిన డియోజ్.. జాతీయ అసెంబ్లీ నామినేషన్ ఓటు వేసిన మరుసటి రోజు ప్రమాణ స్వీకారం చేశారు.
► 1993లో డియాజ్-కానెల్ క్యూబా కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి సేవలు ప్రారంభం
► 1994లో విల్లా క్లారా ప్రావిన్స్ పార్టీ కమిటీ మొదటి కార్యదర్శిగా ఎన్నిక
► గవర్నర్ కంటే ఉన్నత స్థానం
► ఈ పదవిలో సమర్థతను చూపించిన డియోజ్
► డియోజ్ చాలామంది స్వలింగ సంపర్కులపై చర్యలు తీసుకున్నారు
► 2003 లో హోల్గుయిన్ ప్రావిన్స్లో స్థానానికి ఎన్నిక
► ఆ తర్వాత క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఎన్నిక
► 2009లో డియాజ్-కానెల్ ఉన్నత విద్యా మంత్రి
► మార్చి22, 2012 వరకు అదే పదవి
► అతను మంత్రుల మండలి (ఉప ప్రధానమంత్రి) ఉపాధ్యక్షుడయ్యాడు
► 2013 లో అతను కౌన్సిల్ ఆఫ్ స్టేట్ యొక్క మొదటి ఉపాధ్యక్షుడు
ఇవీ చదవండి: ఆ బస్టాప్‌లో ఉన్నది దెయ్యమా.. లేక మనిషేనా.. కానీ ఆ లైన్.. ఇంటర్నెట్‌ని హడలెత్తిస్తోన్న ఫోటో…
Corona Virus: కరోనాను జయించిన మొదటి దేశం ఇదే … మాస్కులు వేసుకోనక్కర్లేదని అధికారికంగా ప్రకటన