Credit Card Data: ప్రముఖ పిజ్జా బ్రాండ్ డొమినోస్ సర్వర్ల నుంచి భారీగా డేటా లీక్ అయింది. భారతీయ వినియోగదారుల డేటా లీక్ అయిందని.. ఇజ్రాయోల్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ అండర్ దీ బ్రీచ్ తెలిపింది. పేరు, ఫోన్ నంబర్లు, ఇమెయిల్ చిరునామాల వివరాలు దాదాపు 10 లక్షల మంది క్రెడిట్ కార్డు వివరాలు డార్క్ వెబ్ లోకి వెళ్ళాయి. ఇవన్ని.. డొమినోస్ సర్వర్‌లో 18 కోట్ల ఆర్డర్లకు సంబంధించిన సమాచారం. ఆ వివరాలన్నీ డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉన్నాయని అండర్ ది బ్రీచ్ గుర్తించింది.250 డొమినోస్ ఉద్యోగుల డేటా కూడా లీక్ అయింది. ఈ డేటా మొత్తం 13 టీబీ సైజ్‌లో ఉన్నట్టు అండర్ ది బ్రీచ్ చీఫ్ అలోన్ గాల్ వెల్లడించారు.
ఈ డేటా లీక్ ఆరోపణల్ని డొమినో పేరెంట్ కంపెనీ అయిన జ్యుబిలియంట్ ఫుడ్ వర్క్స్ ఖండించలేదు. కానీ ఫైనాన్షియల్ డేటా లీక్ అయిందన్న వార్తల్ని తిరస్కరించింది. జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ (డొమినో యొక్క మాతృ సంస్థ) ఇటీవల సమాచార భద్రతా సమస్యను ఎదుర్కొంది. ఏ వ్యక్తి యొక్క ఆర్ధిక సమాచారానికి సంబంధించిన డేటా ఏదీ యాక్సెస్ చేయబడలేదు.
మా విధానం ప్రకారం వినియోగదారుల ఆర్థిక వివరాలు లేదా క్రెడిట్ కార్డు డేటాను మేం స్టోర్ చేయలేము. అందువల్ల డేటా లీక్ అయ్యే అవకాశమే లేదని జ్యుబిలియంట్ ఫుడ్ వర్క్స్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపింది. ప్రస్తుతం దీనిపై తమ దర్యాప్తు కొనసాగుతుందని వివరించింది. హ్యాకర్లు చేతికి చిక్కిన క్రెడిట్ కార్డ్ డేటా మొత్తం భారతీయ యూజర్లదే. 10 లక్షలకు పైగా యూజర్ల క్రెడిట్ కార్డుల వివరాలు లీక్ కావడం కలకలం రేపుతోంది. 18కోట్ల ఆర్డర్స్ వివరాలు, చిరునామాలు, బిల్లింగ్ డీటెయిల్స్ 10 లక్షల క్రెడిట్ కార్డు వివరాలదే అని యుటిబి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అలోన్ గాల్ ఆదివారం ట్వీట్ చేశారు.
ట్వీట్..
Threat actor claiming to have hacked Domino’s India (@dominos) and stealing 13TB worth of data.
Information includes 180,000,000 order details containing names, phone numbers, emails, addresses, payment details, and a whopping 1,000,000 credit cards. pic.twitter.com/1yefKim24A
— Alon Gal (Under the Breach) (@UnderTheBreach) April 18, 2021
Also Read: Adipurush: ‘ఆదిపురుష్’ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. షూటింగ్ గురించి చెప్పుకోచ్చిన డైరెక్టర్..