Covid Vaccine: వ్యాక్సిన్ తీసుకుంటే షాపింగ్ వోచర్లు. పిజ్జా గిప్టు కార్డులు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన ఆ దేశ సర్కార్!

|

Aug 02, 2021 | 7:24 AM

Corona Vaccine: ప్రపంచాన్ని కుదేస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. రెండేళ్లుగా విశ్వవ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపిస్తునే ఉంది. కొత్త వేరియంట్లతో రోజుకో రూపంతో విరుచుకుపడుతోంది.

Covid Vaccine: వ్యాక్సిన్ తీసుకుంటే షాపింగ్ వోచర్లు. పిజ్జా గిప్టు కార్డులు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన ఆ దేశ సర్కార్!
Uk To Offer Shopping, Pizza Discounts
Follow us on

Britain Covid Vaccine Vouchers: ప్రపంచాన్ని కుదేస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడప్పుడే వదిలేలా లేదు. రెండేళ్లుగా విశ్వవ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపిస్తునే ఉంది. కొత్త వేరియంట్లతో రోజుకో రూపంతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ఒక్కటే మార్గమన్న నిపుణుల సూచనలతో అన్ని దేశాల టీకా పంపిణీ చురుకుగా చేపడుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు 50 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నాయి. మరిన్ని దేశాల్లో మందకొడిగా సాగుతోంది. ఇదే క్రమంలో మరింత వేగవంతం చేసేందుకు అయా దేశాలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజలను ప్రొత్సహించేందుకు కొత్త స్కీమ్స్‌తో ఆకట్టుకుంటున్నారు.

కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకునే వారి సంఖ్యను పెంచేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం వినూత్న పథకాల అమలుపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా షాపింగ్‌ వోచర్లు, పిజ్జా డిస్కౌంట్లు, ప్రయాణాల్లో రాయితీలతో ‘వ్యాక్సిన్‌ వోచర్స్‌’ పథకాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. అధిక సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ఈ విధానం దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే అనేక రైడ్‌-హెయిలింగ్‌, ఫుడ్‌ డెలివరీ యాప్‌లు టీకా తీసుకున్న వారికి ప్రయాణ, భోజన రాయితీలు కల్పిస్తున్నాయి.

ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొస్తున్న ‘వ్యాక్సిన్‌ వోచర్స్‌’ పథకంలో ఉబెర్‌, బోల్ట్‌, డెలివెరూ, పిజ్జా పిలిగ్రిమ్స్‌ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. వినియోగదారులకు వివిధ రాయితీలు ప్రకటిండచమే కాకుండా వారు మొదటి, రెండో డోసు టీకా వేసుకునేందుకు తమ వంతుగా సహాయపడతామని పిజ్జా పిలిగ్రిమ్స్‌ వ్యవస్థాపకుడు థామ్‌ ఇలియట్‌ పేర్కొన్నారు. ప్రజలందరూ టీకాలు వేసుకోవడం, సురక్షితంగా సాధారణ స్థితికి చేరుకోవడంలో ఈ పథకం దోహదపడుతుందని డెలివెరూ ప్రతినిధి తెలిపారు. మరోవైపు.. ఈ పథకం ఎలా పని చేస్తుందన్న వివరాలను ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదని స్థానిక మీడియా పేర్కొంది. టీకాలు పొందడం ద్వారా ప్రభుత్వంతో భాగస్వామ్యమైన ఆయా సంస్థల్లో రాయితీలు పొందాలని బ్రిటన్‌ వ్యాక్సిన్‌ మంత్రి నదిమ్‌ జహావి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read Also…  E-Rupi: బ్యాంకు ఖాతాలు, కార్డులు, యాప్‌ లేకుండానే నగదు రహిత చెల్లింపులు.. ‘ఈ-రూపీ’ సిస్టమ్‌కు ఇవాళ ప్రధాని శ్రీకారం