AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్యాలో అంతర్జాతీయ క్రీడా పోటీలకు విముఖత.. ఇప్పటికే దూరమైన టోర్నీలు

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో రష్యాలో క్రీడారంగంపై పెను ప్రభావం పడేలా కనిపిస్తోంది. ఉక్రెయిన్‌పై(Ukraine) దాడి చేస్తున్న రష్యా(Russia)లో టోర్నీలు, మ్యాచ్‌లు ఆడేందుకు...

రష్యాలో అంతర్జాతీయ క్రీడా పోటీలకు విముఖత.. ఇప్పటికే దూరమైన టోర్నీలు
Sports In Russia
Ganesh Mudavath
|

Updated on: Feb 27, 2022 | 8:48 AM

Share

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో రష్యాలో క్రీడారంగంపై పెను ప్రభావం పడేలా కనిపిస్తోంది. ఉక్రెయిన్‌పై(Ukraine) దాడి చేస్తున్న రష్యా(Russia)లో టోర్నీలు, మ్యాచ్‌లు ఆడేందుకు విముఖత చూపుతున్నాయి. పోటీలను రద్దు చేసుకుంటున్నాయి. ఆ దేశంపై అన్ని రంగాల్లో ఆంక్షలు విధించేందుకు ఈయూతో పాటు, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా, తైవాన్‌ లు సిద్ధమయ్యాయి. డోపింగ్‌ వివాదం కారణంగా కొంతకాలం అంతర్జాతీయ క్రీడా పోటీ(Sports)లకు దూరమైన రష్యా.. యుద్ధం నేపథ్యంలో మరో ఏడాది లేదా రెండేళ్లు ప్రభావం పడేలా కనిపిస్తోంది. ఇప్పటికే రష్యాలో జరగాల్సిన ఛాంపియన్స్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ ఫైనల్‌ను ప్యారిస్‌కు తరలించాలని యూఈఎఫ్‌ఏ నిర్ణయించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో అక్కడ జరగాల్సిన ఫార్ములావన్‌ గ్రాండ్‌ ప్రి రేసును నిర్వహించడం అసాధ్యమని ఏఫ్‌ఐఏ వెల్లడించింది. తాజాగా రష్యాతో ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఆడబోమని పోలండ్‌ ప్రకటించింది. ఐఓసీ పిలుపు మేరకు ఈ ఏడాది రష్యాలో జరగాల్సిన వాలీబాల్‌, షూటింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు కూడా ఇతర దేశాలకు తరలిపోయే అవకాశం కనిపిస్తోంది.

రష్యా నుంచి తరలిపోయిన చెస్‌ ఒలింపియాడ్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. రెండు వారాల పాటు సాగే ఈ ఒలింపియాడ్‌లో దాదాపు 190 దేశాలు పోటీపడనున్నాయి. జులై 26 నుంచి ఆగస్టు 8 వరకు మాస్కోలో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. కానీ ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో దీన్ని అక్కడ నిర్వహించడం లేదు. ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఆ దేశ ఆటగాళ్లు మాత్రం శాంతి కోరుకుంటున్నారు. తాను శాంతిని ప్రోత్సహిస్తానని మెద్వెదెవ్‌ చెప్పాడు. ఉక్రెయిన్‌కు చెందిన మాజీ బాక్సింగ్‌ ఛాంపియన్‌ విటాలి.. తన బాక్సింగ్‌ సోదరుడు వ్లాదిమిర్‌తో కలిసి యుద్ధంలో పోరాడుతానని తెలిపాడు.

Also Read

కదులుతున్న బస్సులో అత్యాచారం.. అర్ధరాత్రి సమయంలో దారుణం.. ఉదయం మరో సారి కత్తితో బెదిరించి

ఒక్కసారిగా హైవేపైకి దూసుకొచ్చిన భారీ బండరాళ్లు.. 270 కిమీ రోడ్డు మూసివేత..

కొత్త ఇళ్లు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే త్వరపడండి.. మార్చి తర్వాత మారనున్న రేట్లు..!