India dispatches Covid-19 vaccines: కరోనావైరస్‌తో చిగుటాకులా వణికిపోతున్న దేశాలకు భారత్ బాసటగా నిలుస్తోంది. తాజాగా భారత్ టీకా పంపిణీ విషయంలో మరో రెండు దేశాలకు సాయమందించి ఉదారత చాటుకుంది. కరీబియన్ దేశాలైన బార్బడోస్, డొమినికా దేశాలకు భారత్ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను పంపింది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కోవిషీల్డ్ డోసులను ఆయా దేశాలకు ఆదివారం సరఫరా చేసింది. అయితే ఈ వ్యాక్సిన్ల డోసులను నిన్న రాత్రి 11:35 గంటలకు మహారాష్ట్రలోని ముంబై నుంచి ప్రత్యేక విమానంలో తరలించారు. ఈ మేరకు బార్బడోస్ దేశ ప్రధాని మియా మోట్లీ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. భారత్ తమ పట్ల చూపిన ఆదరాభిమానాలకు ధన్యవాదాలు తెలుపుతూ ఆమె లేఖలో వివరించారు.
ఇప్పటికే చాలా దేశాలకు భారత్ కోవిడ్ డోసులను సరఫరా చేసి అందరిమన్ననలు పొందుతోంది. దీనిలో భాగంగా కరేబీయన్ దేశాలకు కూడా సరఫరా చేసింది. ఇదిలాఉంటే.. ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్లు సరఫరా చేసిన దేశాల్లో ఇండియా మూడో స్థానంలో నిలిచిందని కేంద్రం నిన్న వెల్లడించింది. అమెరికా, బ్రిటన్ తరువాత మన దేశం అత్యధిక టీకా డోసులు ఇచ్చిన దేశమైందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.
Also Read: