Hong Kong Corona Virus: చైనాలో పుట్టిన కరోనా (corona( మహమ్మారి.. ప్రపంచ దేశాలను రెండేళ్లకు పైగా వణికిస్తూనే ఉంది. కరోనా నివారణ కోసం రకరకాల చర్యలు తీసుకుంటూనే ఉన్నారు.. తాజాగా హాంకాంగ్ (Hong Kong) కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా సంచలన నిర్ణయం తీసుకుంది. ఓ పెంపుడు జంతువులను అమ్మే షాప్‌లో కోవిడ్-19 వెలుగులోకి వచ్చింది. దీంతో ఆశ షాపులో ఉన్న దాదాపు 2,000 పెంపుడు జంతువులను చంపేయడానికి అక్కడ సర్కార్ రెడీ అయింది. ఈ పెట్ షాపులో హ్యామ్‌స్టర్లు, చిన్న క్షీరదాలను అమ్ముతారు. వివరాల్లోకి వెళ్తే..
పెట్ స్టోర్‌లో పని చేసే ఒక ఉద్యోగికి డెల్టా వేరియంట్ సోకింది. అతనికి కరోనావైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన తరువాత షాపులోని వందల జంతువులకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. వీటిలో 11 హ్యామ్‌స్టర్లకు వైరస్ సోకినట్లు నిర్ధరణైంది. కుందేళ్లు, షించిలాస్ లాంటి జంతువులకు పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా షాపు లోని చిట్టెలుకలతో సహా సుమారు 2,000 చిన్న జంతువులను చంపడానికి హాంకాంగ్ అధికారులు రెడీ అయ్యారు. ఈ స్టోర్‌లోని జంతువులను నెదర్లాండ్స్ నుండి దిగుమతి చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో మరో వైపు వ్యవసాయం, మత్స్య పరిరక్షణ శాఖ అధికారులు నగరంలోకి చిట్టెలుకల అమ్మకాలు, చిన్న క్షీరదాల దిగుమతిని కూడా నిలిపివేశారు. ప్రస్తుతం వధించబోయే హ్యామ్‌స్టర్లు 34 భిన్న ప్రాంతాల్లోని షాప్‌లు, జంతు సంక్షణ కేంద్రాల్లో ఉన్నాయి.
కోవిడ్-19 వ్యాప్తి కట్టడికి హాంకాంగ్ భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది.”జీరో కోవిడ్” పేరుతో ఈ మహమ్మారిని తమ దేశం నుంచి తరిమివేయడానికి రకరకల ప్లాన్స్ ను వేస్తోంది. ఇక దేశంలో ఎవరైనా డిసెంబరు 22 తర్వాత హ్యామ్‌స్టర్లను కొనుగోలు చేసినా లేదా ఎవరిదగ్గర నుంచి అయినా క్రిస్మస్ బహుమతిగా పొందినా వాటిని అధికారులకు అప్పగించాలని ఆదేశాలు జారీచేశారు.
Also Read: