
మధ్యప్రాచ్యం ఇప్పుడు ఒక అగ్నిగుండంలా మారింది.. ఇరాన్ – ఇజ్రాయెల్-అమెరికా యుద్ధంతో.. ఎన్నో దేశాల్లో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి.. ముఖ్యంగా.. ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాల్లోని ప్రజలు.. గజగజ వణికిపోతున్నారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో.. ఎప్పుడు ఏ బాంబ్ పడుతుందో అంటూ ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. దీంతో భారత్ నుంచి వలస వెళ్లిన వేలాది మంది దేశానికి తిరుగు ప్రయాణమవుతున్నారు.. ఈ క్రమంలోనే.. అబుదాబిలోని BAPS హిందూ మందిర్.. వాలంటీర్లు అందించిన నిస్వార్థ సేవ.. మానవత్వాన్ని వెల్లువిరిసేలా చేసింది.. వారు ఆహారం, ఆశ్రయం, మార్గదర్శనం, అందించడంతోపాటు.. మానసిక చాలామందిలో మానసిక స్థైర్యాన్ని బలాన్ని అందించారు.
యుద్ధ ప్రాంతంలోని కల్లోలం నుంచి సురక్షిత గృహ వాతావరణానికి చేరుకున్న ప్రయాణాన్ని ఆవిష్కరించే డాక్యుమెంటరీ “Comfort in Kuwait” ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తోంది. యుద్ధ పరిస్థితుల్లో అనిశ్చితి మధ్య సాధారణ ప్రయాణం ఒక పెద్ద పరీక్షగా మారింది. కువైట్‌లో తమ కుటుంబాలతో చిక్కుకుపోయిన పలువురు, స్వదేశానికి దూరంగా భయం, గందరగోళం, తెలియని పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆ కఠిన సమయంలో మానవత్వం వెలుగొందింది.
BAPS Hindu Mandir, దాని వాలంటీర్లు ముందుకు వచ్చి బాధితులకు ఆహారం, ఆశ్రయం, మార్గదర్శనం, మానసిక ధైర్యాన్ని అందించారు. వారి నిస్వార్థ సేవలతో అక్కడ చిక్కుకున్నవారికి ఆశ నింపడంతో పాటు సురక్షితంగా స్వదేశానికి చేరుకునే మార్గం ఏర్పడింది.
ఈ డాక్యుమెంటరీ కష్టకాలంలో మానవత్వం, విశ్వాసం, సేవ ఎంతటి భయాన్నైనా జయించగలవని చూపిస్తుంది. కుటుంబంలా ఒకరికి ఒకరు తోడుగా నిలిచిన సంఘీభావం భవిష్యత్తుకు వెలుగునిస్తుంది అనే సందేశాన్ని ఈ కథ బలంగా తెలియజేస్తోంది.
Comfort in Kuwait.. ఈ వీడియో డాక్యుమెంటరీ, యుద్ధ ప్రాంతంలోని గందరగోళం నుండి సొంత ఇంటి సౌకర్యం వరకు సాగే ఒక ప్రయాణం.. సంక్షోభ సమయాల్లో కూడా మానవత్వం, విశ్వాసం, సేవ భయాన్ని జయించి, ప్రజలను ఒక కుటుంబంలా ఏకం చేసి, మన భవిష్యత్తుకు మార్గాన్ని ప్రకాశవంతం చేయగలవని ఈ శక్తివంతమైన కథ గుర్తు చేస్తుంది.