Watch Video: ఘోర విమాన ప్రమాదం.. చివరి క్షణాల్లో ఏమైందంటే..? భయనక దృశ్యాలు..

|

Mar 21, 2022 | 6:32 PM

Plane Crash In China: చైనాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద దృశ్యాలు చూస్తుంటే.. ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరు కూడా బతకడం కష్టమేనంటూ అక్కడి అధికారులు పేర్కొంటున్నారు.

Watch Video: ఘోర విమాన ప్రమాదం.. చివరి క్షణాల్లో ఏమైందంటే..? భయనక దృశ్యాలు..
China
Follow us on

Plane Crash In China: చైనాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద దృశ్యాలు చూస్తుంటే.. ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఏ ఒక్కరు కూడా బతకడం కష్టమేనంటూ అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 133 ప్రయాణికులతో వెళ్తున్న చైనాకు చెందిన ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ బోయింగ్‌ 737 విమానం దక్షిణ చైనా గ్వాంగ్‌జీ జియాంగ్‌ ప్రాంతంలోని పర్వత ప్రాంతంలో కుప్పకూలింది. మంటలు చెలరేగి విమానం కుప్పకూలినట్టు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. విమానం కన్‌మింగ్‌ నుంచి గ్వాంగ్‌జాంగ్‌ ప్రాంతానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

ఎత్తైన పర్వత శిఖరం, దట్టమైన చెట్ల మధ్య విమానం కూలిపోవడంతో సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ప్రభుత్వ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ దుర్ఘటనలో ఎవరూ ప్రాణాలతో మిగిలివుండకపోవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. విమాన శకలాలు.. అటవీ ప్రాంతంలో అక్కడక్కడ పడ్డాయి. ఇంకా అక్కడికి చేరుకునేందుకు సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. విమానం కుప్పకూలడంతో అటవీ ప్రాంతంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.

అయితే.. ప్రస్తుతం విమానం కుప్పకూలే ఆఖరి క్షణాలకు సంబంధించిన భయనక వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే.. అగ్నిమాపక సిబ్బంది క్రమంగా ఘటనా స్థలానికి చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

వుజౌ నగరానికి వందలాది మంది సిబ్బందిని పంపినట్లు చైనాలోని సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది.

చైనాలోని కున్మింగ్ నుంచి గ్వాంగ్‌జౌకి ఈ విమానం మధ్యాహ్నం 1.11 గంటలకు బయలుదేరింది. ఫ్లైట్ ట్రాకింగ్ ప్రకారం.. మధ్యాహ్నం 2.22 గంటలకు 3225 అడుగుల ఎత్తులో 376 కి.మీ వేగంలో ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది మధ్యాహ్నం 3.05 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది.

Also Read:

China Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 133 మంది ప్రయాణికుల దుర్మరణం..

Flight Diverted: ఢిల్లీ- దోహా విమానంలో పొగలు.. కరాచీకి దారి మళ్లింపు.. ఫ్లైట్‌లో ఎంతమంది ఉన్నారంటే..