Queen Elizabeth: పార్లమెంట్‌లోకి క్విన్‌ ఎలిజబెత్‌ పార్థివదేహం.. చైనా ప్రతినిధులకు ఎదురుదెబ్బ..!

|

Sep 16, 2022 | 10:51 PM

Queen Elizabeth: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ II పార్థివదేహాన్ని బకింగ్‌హం ప్యాలెస్‌ నుంచి పార్లమెంట్‌ హౌసెస్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌కు తరలించారు. దీంతో రాణికి తుది నివాళులు..

Queen Elizabeth: పార్లమెంట్‌లోకి క్విన్‌ ఎలిజబెత్‌ పార్థివదేహం.. చైనా ప్రతినిధులకు ఎదురుదెబ్బ..!
Queen Elizabeth
Follow us on

Queen Elizabeth: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ II పార్థివదేహాన్ని బకింగ్‌హం ప్యాలెస్‌ నుంచి పార్లమెంట్‌ హౌసెస్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌కు తరలించారు. దీంతో రాణికి తుది నివాళులు అర్పించేందుకు భారీ ఎత్తున పౌరులు తరలివస్తున్నారు. అయితే రాణి అంత్యక్రియలకు హాజరు అయ్యే చైనా ప్రతినిధి బృందానికి రాణికి నివాళులు అర్పించేందుకు అనుమతి ఇవ్వలేదు. బ్రిటన్‌ రాణి అంత్యక్రియలకు చైనాకు ఆహ్వానించడం పట్ల కొందరు యూకే పార్లమెంట్‌ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చైనాలో మానవహక్కుల ఉల్లంఘన అంశాన్ని లేవనెత్తిన పలువురు బ్రిటన్‌ ప్రజాప్రతినిధులపై చైనా ఆంక్షలు విధించింది. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా ప్రతినిధులను ఆహ్వానించడం పట్ల బ్రిటన్‌ ఎంపీలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

చైనా ఆంక్షల కారణంగా పార్లమెంట్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్‌ హాల్‌లో ప్రవేశానికి దిగువస సభ స్పీకర్‌ నిరాకరించడంతో చైనా ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని హాజరు కాకుండా నిషేధించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై మాట్లాడేందుకు స్పీకర్‌ కార్యాలయం నిరాకరించింది. భద్రతా అంశం ఉన్నందున దీనిపై మేము స్పందించలేమని హౌస్‌ ఆఫ్‌ కామర్స్‌ పేర్కొంది. రాణి శవపేటికను చూసేందుకు చైనా బృందానికి పార్లమెంట్‌లోకి అనుమతి ఇవ్వకూడదని బ్రిటన్‌ నిర్ణయించింది. ఇదే విషయంపై ప్రధానమంత్రి లిజ్‌ ట్రస్‌ కార్యాలయం స్పందించింది. రాణి అంత్యక్రియలకు సంబంధించి బ్రిటన్‌తో దౌత్య సంబంధాలున్న దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించే విషయం బకింగ్‌హమ్‌ ప్యాలెస్ చూసుకుంటోంది. విదేశాంగ కార్యాలయం సలహా మేరకు ప్రతినిధుల జాబితాను సిద్ధం చేస్తోందని ప్రధాన మంత్రి అధికార ప్రతినిధి వెల్లడించారు.

సెప్టెంబర్‌ 19న జరగనున్న క్విజ్‌ ఎలిజబెత్‌II అత్యక్రియల కోసం ప్రపంచ వ్యాప్తంగా వందలాది మంది ప్రముఖులకు ఆహ్వానం అందింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో పాటు వివిధ దేశాల నేతలు హాజరు కానున్నారు. చైనా తరపున ఆ దేశ ఉపాధ్యక్షుడు వాంగ్‌ కిషాన్‌ హాజరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం బ్రిటన్‌ పార్లమెంట్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి చైనా రాయబారిని నిషేధించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి