Chinese Hackers:భారత వ్యవస్థలపై చైనా హ్యాకర్లు దాడి చేశారంటూ వస్తున్న వార్తలపై చైనా దేశం స్పందించింది. భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ ఔషధ సంస్థలపై చైనా సైబర్ దాడులకు పాల్పడిందంటూ సైఫిర్మా అనే అంతర్జాతీయ సంస్థ నివేదికను తోసిపుచ్చింది. టీకా సమాచారాన్ని తస్కరించడమే లక్ష్యంగా హ్యకర్ బృందాలు దాడులు చేస్తున్నారని నివేదికలను తప్పుబట్టింది. ఇక భారత్ పోర్టులపైనా చైనా హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడుతున్నారంటూ రికార్డెడ్‌ప్యూచర్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒకరిపై నిందలు వేయడం సరైంది కాదని తెలిపింది. ఇది దుర్మర్గమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ అన్నారు. సంబంధిత నివేదికను భారత్ కూడా ఖండించినట్లు గమనించామని బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు.
మరో వైపు, భారత్‌లో ప్రతిష్టాత్మక సంస్థలు, వ్యతిరేక లక్ష్యంగా చైనా హ్యాకర్లు దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విద్యుత్ వ్యవస్థలు, ఔషధ సంస్థల ఐటీ విభాగాలపై హ్యాకింగ్‌కు పాల్పడినట్లు అంతర్జాతీయ సంస్థలు నివేదించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా భారత్‌లోని చైనా హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడుతున్నారంటూ అమెరికాకు చెందిన సంస్థ అప్రమత్తం చేసింది. చైనా ప్రభుత్వం సహకారంతో కొనసాగుతున్న హ్యాకింగ్ బృందాలు భారత వ్యవస్థలపై గురిపెట్టినట్లు తెలుస్తోంది.
కాగా, దేశంలో కీలక వ్యవస్థలు, సంస్థలపై చైనాసైబర్ దాడులకు పాల్పడుతుండటం గత సంవత్సరం నుంచే ప్రారంభమైందని రికకార్డెడ్ ఫ్యూచర్ తెలిపింది. గల్వాన్ ఘటన తర్వాత ప్రభుత్వం చైనా యాప్‌లను నిషేధించడంతో ఈ దాడులు మరింత తీవ్రమైనట్లు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ వార్తలను చైనాఖండించింది.
తమిళనాడు చిన్నమ్మ సంచలన నిర్ణయం… రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన శశికళ