China Warning: తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే అణు బాంబులు వేస్తాం.. జపాన్ కు చైనా హెచ్చరిక

| Edited By: Phani CH

Jul 21, 2021 | 6:22 PM

తైవాన్ విషయంలో జోక్యం చేసుకున్న పక్షంలో అణు బాంబులు వేస్తామని, పూర్తి స్థాయి యుద్దానికి దిగుతామని చైనా...జపాన్ ను హెచ్చరించింది.

China Warning: తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే అణు బాంబులు వేస్తాం.. జపాన్ కు చైనా హెచ్చరిక
China President Xi Jinping
Follow us on

తైవాన్ విషయంలో జోక్యం చేసుకున్న పక్షంలో అణు బాంబులు వేస్తామని, పూర్తి స్థాయి యుద్దానికి దిగుతామని చైనా…జపాన్ ను హెచ్చరించింది. తైవాన్ పై తమకు సర్వ హక్కులు ఉన్నాయని ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని స్టేట్ మీడియా ప్రసారం చేసింది. అణ్వాయుధాలు లేని దేశాలపై వీటిని తాము ప్రయోగించబోమని చైనా తమ పాలసీగా పెట్టుకుంది. ఏమైనా.. తైవాన్ అంశంలో మీరు కలగజేసుకున్న పక్షంలో ..మీరు బేషరతుగా లొంగిపోయేంతవరకు న్యూక్లియర్ బాంబులను ప్రయోగిస్తునే ఉంటామని ఈ సందేశంలో వార్నింగ్ ఇచ్చింది చైనా.. కాగా ఈ మెసేజ్ కి 20 లక్షల వ్యూస్ వచ్చిన అనంతరం దీన్ని చైనీస్ సోషల్ మీడియా ‘జిగువా’ నుంచి డిలీట్ చేశారు. కానీ అప్పటికే యూజర్లు దీన్ని యూట్యూబ్, ట్విటర్ వంటివాటిలో అప్ లోడ్ చేసి వదిలారు. తమ దేశ సార్వభౌమాధికారాన్ని జపాన్ రక్షించవలసి ఉందంటూ తైవాన్ డిప్యూటీ ప్రధాని ఒకరు వ్యాఖ్యానించగా..దీనిపై జపాన్ అధికారులు సుమారు రెండు వారాల క్రితం స్పందించారు.

తమ దేశంలో చైనా ఆక్రమణను తైవాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పైగా అమెరికా, ఇండియా వంటి దేశాల రక్షణను కూడా కోరుతోంది. ఏడు దశాబ్దాలుగా తైవాన్ పై తమకే హక్కు ఉందని చైనా, జపాన్ కీచులాడుకుంటున్నాయి. గత ఏడాది సెప్టెంబరులో చైనా .. ఈ దేశ (తైవాన్) భూభాగంపైకి తమ ఫైటర్ జెట్ విమానాలను పంపింది. ఎప్పటికప్పుడు తైవాన్ రాజధాని తైపీలోని పరిస్థితిని తెలుసుకుంటోంది. ఈ చిన్న దేశంపై తమకే హక్కులు ఉన్నాయంటూ చైనా పార్లమెంట్ గత ఏడాది ఓ చట్టాన్ని ఆమోదించింది కూడా.. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తైవాన్ లో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Khela Hobe: బీజేపీని అధికారం నుంచి కూలదోసేంతవరకు ‘ఆట ఆగదు’.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గర్జన

RS Praveen Kumar: RS ప్రవీణ్‌కుమార్‌కు కొత్త చిక్కులు.. కరీంనగర్‌లో కేసు నమోదు..