Covid 19: కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ .. లాక్ డౌన్ దిశగా అడుగులు.. నిత్యవసర వస్తువులు నిల్వ చేసుకోవాలని సూచన

|

Nov 03, 2021 | 6:49 AM

Covid 19: కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో ఈ వైరస్ విజృంభణ తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ కేసుల నమోదు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో క్రమంగా..

Covid 19: కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ .. లాక్ డౌన్ దిశగా అడుగులు.. నిత్యవసర వస్తువులు నిల్వ చేసుకోవాలని సూచన
China Corona
Follow us on

Covid 19: కరోనా వైరస్ పుట్టినిల్లు చైనాలో ఈ వైరస్ విజృంభణ తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ కేసుల నమోదు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో క్రమంగా కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుంది. దీంతో డ్రాగన్ కంట్రీ తమ దేశ ప్రజలను అలెర్ట్ చేసింది. లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తుంది. దీంతో తమ దేశంలోని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. నిత్యావసర వస్తువులను నిల్వజేసుకోవాలని సూచించింది.

కోవిడ్ వెలుగు చూస్తున్న పట్టణాల్లో నిబంధనలు మరింత కఠిన తరం చేస్తుంది. సరిహద్దులు మూసివేస్తుంది. క్వారంటైన్ అమలు చేస్తుంది. లాక్ డౌన్ విదిస్తుంది.  అయితే గత కొంతకాలంగా చైనా ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా లేదని తెలుస్తోంది.  ఆ దేశంలోని భారీ వర్షాలు వరదలకు పంటలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటున్నయి. పర్యావరణ మార్పులు ఈ పరిస్థితిని మరింత దిగజార్చే అవకాశం ఉందంటూ ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ముందుగా ఆహార నిల్వల కోసం హెచ్చరిస్తుందని మరో టాక్ఆం కూడా వినిపిస్తోంది.

ఇక కరోనా వైరస్ ప్రావిన్సులో మళ్ళీ వెలుగులోకి వచ్చింది.  తొంభై రెండు కొత్త కేసులు సోమవారం నమోదయ్యాయి. ఇది సెప్టెంబర్ మధ్య నుండి అత్యధికం. దీంతో మళ్ళీ ప్రభుత్వం అప్రమత్తమైంది.. కొవిడ్ విషయంలో జీరో టోలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోన్న చైనా.. కేసులు ఏ మాత్రం పెరుగుతున్నాయని అనిపించినా, తక్షణ చర్యలకు ఉపక్రమిస్తోంది. ప్రభుత్వం కొన్ని అంతర్-ప్రాంతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. కరోనా పరీక్షలను వేగవంతం చేసింది.  వివాహాలు,  విందులు వంటి సామాజిక సమావేశాలను వాయిదా వేయమని ప్రజలను కోరింది. సరిహద్దుల మూసివేత, లాక్‌డౌన్లు, సుదీర్ఘ క్వారంటైన్లు అమలు చేస్తోంది. ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్‌కు ఏమాత్రం ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈసారి మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.  షాంఘై డిస్నీల్యాండ్ థీమ్ పార్క్ ఆదివారం రాత్రి నుండి తాత్కాలికంగా మూసివేసింది. అంతేకాదు సందర్శకులు, పార్క్ సిబ్బందిని కోవిడ్ పరీక్ష నిర్వహించింది.  దీంతో డ్రాగన్ కంట్రీ కరోనా వైరస్ అనగానే ఎంత ఉల్కిపడుతుందో తెలుస్తోందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read:

 మానసిక ఇబ్బందులనే కాదు.. అనేక వ్యాధులకు చెక్ పెట్టే దివ్య మూలిక ఒరెగానో..