India – China Border Standoff – Galwan valley Clash Video: లడఖ్‌లోని ఎల్ఏసీ వెంబడి గల్వాన్ లోయలో గతేడాది భారత్ – చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ హింసాత్మక దాడిలో 19 మంది భారత సైనికులు అమరులయ్యారు. 2019 జూన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చైనా శుక్రవారం విడుదల చేసింది. ఈ వీడియోను చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. అయితే.. భారత బలగాలే చైనా వైపు దూసుకొచ్చాయని అందులో పేర్కొంది. ఇరు దేశాల సైన్యాలు వాగ్వాదం జరిగినట్లు అందులో కనిపించింది. కాగా ఈ ఘర్షణలో ఐదుగురు చైనా సైనికులు మరణించారని వారికి నివాళులర్పిస్తున్నట్లు చైనా వెల్లడించింది. ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులు చనిపోయారని.. చాలామంది గాయాలపాలయ్యారని వెల్లడించింది.
ఇదిలాఉంటే. పాంగాంగ్ సరస్సు ఇరువైపులా.. ఇరు దేశాల బలగాల ఉపసంహరణ ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. అంతేకాకుండా భారత్-చైనా దేశాల సీనియర్ కమాండర్ల స్థాయి పదో రౌండ్ చర్చలు శనివారం జరగనున్నాయి. ఈ క్రమంలోనే వీడియో విడుదల చేయడంపై ప్రాధాన్యం సంతరించుకుంది.
An on-site video reveals in detail the four #PLA martyrs and other brave Chinese soldiers at the scene of the Galwan Valley border clash with India in June 2020. https://t.co/hSjP3hBnqr pic.twitter.com/g6zNpT1IrX
— Global Times (@globaltimesnews) February 19, 2021
Also Read: