China – India Faceoff: భారత్‌పై కాలుదువ్విన కమాండర్‌కు కీలక పదవి కట్టబెట్టిన డ్రాగన్..

|

Mar 02, 2021 | 9:06 AM

China parliamentary body: భారత్ - చైనా సరిహద్దుల్లో గతేడాది నుంచి పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కదిద్దుకుంటున్నాయి. ఇరు దేశాలు కూడా తమ తమ బలగాలను వెనక్కు తీసుకుంటున్నాయి. ఈ తరుణంలో..

China - India Faceoff: భారత్‌పై కాలుదువ్విన కమాండర్‌కు కీలక పదవి కట్టబెట్టిన డ్రాగన్..
Follow us on

China parliamentary body: భారత్ – చైనా సరిహద్దుల్లో గతేడాది నుంచి పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కదిద్దుకుంటున్నాయి. ఇరు దేశాలు కూడా తమ తమ బలగాలను వెనక్కు తీసుకుంటున్నాయి. ఈ తరుణంలో చైనా మరో కీలక నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. డోక్లాం, తూర్పు లద్దాఖ్‌ల్లో భారత్‌తో ఘర్షణల సమయంలో దళాలను నడిపించిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) కమాండర్‌ జనరల్‌ ఝావో జాంగ్‌క్వీకి.. చైనా అత్యున్నతమైన పార్లమెంటరీ కమిటీలో కీలక పదవిని కట్టబెట్టింది. భారత సరిహద్దుల్లో విధులు నిర్వహించిన జనర్‌ ఝావో ఝాంగ్‌క్వీని అత్యంత కీలకమైన నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌లో విదేశీ వ్యవహారాల విభాగంలో డిప్యూటీ చైర్మన్‌గా నియమించింది. మార్చి 5 తేదీ నుంచి నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ వార్షిక సమావేశం జరగనుంది.

65 ఏళ్ల జనరల్‌ ఝావో చైనా వెస్ట్రన్‌ కమాండ్‌కు చీఫ్‌గా వ్యవహరించారు. ఆయన హయాంలోనే 2017లో సరిహద్దుల్లోని డోక్లాం వద్ద, 2020లో లఢఖ్ వద్ద ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తొలుత 2017లో డోక్లాం వద్ద పీఎల్‌ఏ రోడ్లు వేయడానికి ప్రయత్నించడంతో వివాదం చెలరేగింది. ఈ వివాదం దాదాపు రెండు నెలలకుపైగా కొనసాగింది. ఆ తర్వాత గతేడాది జూన్ నెలలో లఢఖ్ వద్ద భారత్‌-చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. గాల్వాన్ ఘర్షణలో చైనా దురాఘతానికి 19 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటినుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూ వచ్చాయి.

పీఎల్‌ఏలో అత్యుత్తమ జనరల్స్‌ పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు. దీంతో ఇటీవలే కమాండర్‌ జనరల్‌ ఝావో జాంగ్‌క్వీ పీఎల్ఏ పశ్చిమ కమాండ్‌ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. తాజాగా ఝావో స్థానంలో జనరల్‌ ఝాంగ్‌ షుడాంగ్‌ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాతే పాంగాంగ్‌ వద్ద ఇరుదేశాలు సైనికులు వెనక్కి పయనమయ్యాయి.

Also Read:

నిరుడుగప్పిన నిప్పులా మారిన భారత్-చైనా సరిహద్దు వివాదం.. బలగాలు వెనక్కు తగ్గినా.. మారని పరిస్థితి

ఇండియాలోని విద్యుత్ కేంద్రాలపై చైనా కన్ను ! ముంబై పవర్ కట్ కి అదే కారణమా ?