China-America Balloons: చైనా -అమెరికా మధ్య బెలూన్‌ వార్‌.. మూడు గూఢచర్య బెలూన్లను పేల్చేసిన అమెరికా

అమెరికా-చైనా మధ్య బెలూన్‌ వార్‌ తారాస్థాయికి చేరింది. అమెరికా బెలూన్లు కూడా తమ గగనతలం లోకి వచ్చినప్పటికి సంయమనం పాటించామని చైనా చెబుతోంది. వాతావరణ పరిశోధనల కోసం..

China-America Balloons: చైనా -అమెరికా మధ్య బెలూన్‌ వార్‌.. మూడు గూఢచర్య బెలూన్లను పేల్చేసిన అమెరికా
China - America

Updated on: Feb 14, 2023 | 5:30 AM

అమెరికా-చైనా మధ్య బెలూన్‌ వార్‌ తారాస్థాయికి చేరింది. అమెరికా బెలూన్లు కూడా తమ గగనతలం లోకి వచ్చినప్పటికి సంయమనం పాటించామని చైనా చెబుతోంది. వాతావరణ పరిశోధనల కోసం తాము ప్రయోగించిన బెలూన్‌ను అమెరికా అనవసరంగా కూల్చిందని, దీనికి ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. దీంతో చైనా -అమెరికా మధ్య బెలూన్‌వార్‌ మరింత ముదిరింది. తమ గగనతలంలో మూడు చైనా గూఢచర్య బెలూన్లను పేల్చేసినట్లు అమెరికా చెబుతుంటే, తమ గగనతలంలో కనిపించింది మాత్రం- చైనా బెలూన్‌కంటే చిన్నగా ఉందని కెనెడా రక్షణశాఖ సంప్థ చెబుతోంది. అయితే అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ మరో వాదన కూడా వినిపిస్తోంది. అవి ఏలియన్స్‌ కావచ్చేమోనని ఎయిర్‌ఫోర్స్‌ జనరల్ చెబుతున్నారు.

పదికంటే ఎక్కువసార్లు బెలూన్లను పంపిందన్న చైనా

తమ గగనతలంలోకి అమెరికా ఈ జనవరి నుంచి పదికంటే ఎక్కువసార్లు బెలూన్లను పంపించిందని చైనా ఆరోపించింది. తాము ఒక స్పై బెలూన్‌ను ఈనెల నాలుగోతేదీన షూట్‌ చేసినట్లు అమెరికా ప్రకటించిన తర్వాత చైనా తాజాగా స్పందించింది. తమపై తప్పుడు ప్రచారాలు చేయకుండా తీరు మార్చుకోవాలంటూ అగ్రారాజ్యానికి డ్రాగన్‌ హితవు పలికింది.

అమెరికా రెచ్చగొట్టినప్పటికి తాము పట్టించుకోలేదని చైనా విదేశాంగశాఖ ప్రకటించింది. ఆ ఘటనల్లో తాము చాలా బాధ్యతగా, ప్రొఫెషనల్‌గా ప్రవర్తించామని వివరణ ఇచ్చింది. అయితే చైనా పైకి తాము ఎలాంటి బెలూన్లు ప్రయోగించలేదని అమెరికా రక్షణశాఖ స్పష్టం చేసింది. అమెరికాలో కన్పించిన భారీ నిఘా బెలూన్‌ను అమెరికా కొద్దిరోజుల క్రితమే కూల్చేసింది. క్షిపణి స్థావరాలపై గూఢచర్యం కోసమే ఆ ‘ఎయిర్‌షిప్‌’ను తమ దేశంపైకి చైనా ప్రయోగించిందని ఆరోపించింది అమెరికా. వాతావరణ పరిశోధన కోసం ఆ బెలూన్‌ను ప్రయోగించినట్టు చైనా స్పష్టం చేసింది. ఈ బెలూన్‌ను కూల్చివేసిన తర్వాత ఆ శకలాలను డ్రాగన్‌కు ఇచ్చేందుకు అమెరికా నిరాకరించింది. ఆ బెలూన్‌లో కమ్యూనికేషన్‌ సంకేతాలను సేకరించగలిగే పరికరాలు ఉన్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి