Goat Of Kyiv: రష్యా సైనికులకు చుక్కలు చూపించిన చిన్న మేక.. యుద్ధంలో గ్రనేడ్లను పేల్చింది..

|

Jun 27, 2022 | 9:49 PM

ఉక్రేనియన్ సైన్యం ధైర్యం గురించి మీరు చాలా కథలు విన్నారు. కానీ ఈ రోజుల్లో ఉక్రెయిన్ 'పెర్కీ' మేక గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించబడుతోంది. ఈ మేక రష్యన్ సైన్యంపైనే విరుచుకుపడి వారిని..

Goat Of Kyiv: రష్యా సైనికులకు చుక్కలు చూపించిన చిన్న మేక.. యుద్ధంలో గ్రనేడ్లను పేల్చింది..
Goat Of Kyiv
Follow us on

రష్యా-ఉక్రెయిన్ నడుమ భీకర పోరు కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు ఇప్పటికే చాలా భాగం నష్టపోయినా వెనక్కి తగ్గే సమస్యే లేదంటూ పోరు కొనసాగిస్తున్నాయి. ఈ యుద్ధం ప్రారంభమై 4 నెలలకు పైగా గడిచినా రష్యా దాడులు ఉక్రెయిన్ నగరాల నుంచి గ్రామాల వరకు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు గ్రెనేడ్లతో, కొన్నిసార్లు క్షిపణులతో, కొన్నిసార్లు ట్యాంకులతో రష్యా సైన్యం దాడి చేస్తోంది. అయితే, ఉక్రెయిన్ సైన్యం మాత్రం తాము ఈ దాడులను దృఢంగా ఎదుర్కొంటున్నామని, ప్రతీకారం తీర్చుకుంటున్నామని చెప్పారు. ఈ యుద్ధంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఉక్రెయిన్ తనకంటే ఎన్నో రెట్లు శక్తిమంతమైన శత్రువును ఎదుర్కొంటూ చాలా ధైర్యంగా ముందుకు సాగుతోంది. ఉక్రేనియన్ సైన్యం ధైర్యం గురించి మీరు చాలా కథలు విన్నారు. కానీ ఈ రోజుల్లో ఉక్రెయిన్ ‘పెర్కీ’ మేక గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించబడుతోంది. ఈ మేక రష్యన్ సైన్యంపైనే విరుచుకుపడి వాటిని గ్రెనేడ్‌తో పేల్చింది. . అవును, వినడానికి చాలా వింతగా ఉంది కదా.. కానీ ఇది పూర్తిగా నిజం. అసలేం జరిగిందంటే…

ఉక్రెయిన్‌లోని జపొరోజియా పట్టణానికి కాస్త దూరంలో ఉన్న కిన్ స్కీ రోజ్డొరీ గ్రామంలోని ఆస్పత్రి సమీపంలో రష్యా సైనికులు.. ఉక్రెయిన్ సైనికులను చంపేందుకు (బూబీ ట్రాప్‌లు) గ్రనేడ్లను నేలలో వరుసగా అమర్చి వాటికి తీగలను కనెక్ట్ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆ ప్రాంతానికి కాస్త దూరంలో ఉన్న ఓ మేకల ఫామ్ నుంచి ఓ మేక తప్పించుకుని బయటికి వచ్చింది. బూబీ ట్రాప్ లను అమర్చుతున్న ప్రాంతం వైపు పరుగెత్తింది. మొదట ఒక ట్రాప్ దాని కాలికి తగిలి గ్రనేడ్ పేలింది. దీనితో భయపడిన మేక వేగంగా పరుగెత్తడంతో వరుసగా ఒకదాని తర్వాత మరోటి గ్రనేడ్ లన్నీ పేలిపోయాయి. వాటిని అమర్చుతూ వెళ్తున్న రష్యా సైనికులు దీంతో కకావికలమయ్యారు. ఈ పేలుళ్లలో 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని.. కొందరు చనిపోయి ఉంటారని ఉక్రెయిన్ నిఘా వర్గాలు తెలిపాయి. ఆ మేక చనిపోయిందో లేదో తెలియదు కానీ.. రష్యా సైనికులను మాత్రం వణికించిందని దానిని ‘ఘోస్ట్ ఆఫ్ కీవ్’ గా పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి