Missouri Walmart: తేడా వస్తే తగ్గేదే లే.. వాల్‌మార్ట్ స్టోర్‌లో దారుణంగా కొట్టుకున్న కస్టమర్స్..

|

Oct 15, 2022 | 3:43 PM

షాప్ లో ముష్టి యుద్ధం చేసిన వ్యక్తులు అందరూ ఒకరినొకరు తెలుసు అని అధికారులు విశ్వసిస్తున్నారని పోలీసు చీఫ్ పేర్కొన్నారు. "ఇప్పటికే ఈ గొడవలో ప్రమేయం ఉన్న కొంతమంది వ్యక్తులను గుర్తించమని " అని చెప్పారు

Missouri Walmart: తేడా వస్తే తగ్గేదే లే.. వాల్‌మార్ట్ స్టోర్‌లో దారుణంగా కొట్టుకున్న కస్టమర్స్..
Walmart Fight
Follow us on

యునైటెడ్ స్టేట్స్‌లోని వాల్‌మార్ట్ స్టోర్‌లో జరిగిన హింసాత్మక ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతుంది.  దాదాపు 25 మందికి పైగా కస్టమర్‌లు షాప్ లో కొట్టుకున్నారు. ఈ హింసాత్మక ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణను ప్రారంభించామని పోలీసులు చెప్పారు.

న్యూయార్క్ పోస్ట్ ప్రకారం .. మిస్సోరిలో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్‌ లోపల సెల్ఫ్ చెక్ అవుట్ ప్రాంతంలో మంగళవారం ఘర్షణ జరిగింది. షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది. ప్రజలు బిగ్గరగా అరుస్తూ.. ఒకరినొకరు తిట్టుకుంటూ.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకున్నారు. తన్నడం, తొక్కడం కూడా చేశారు. మరికొందరు వ్యక్తులు తమకు అందుబాటులో ఉన్న వస్తువులను తీసుకుని ఇతరపై దాడి కూడా చేశారు.

ఇవి కూడా చదవండి

ఫెర్గూసన్ పోలీస్ చీఫ్ ఫ్రాంక్ మెక్‌కాల్ ఈ సంఘటనపై స్పందిస్తూ.. ఇది చాలా  “అవమానకరం” అని అన్నారు. 10 నుండి 25 మంది వరకు ఒకరిపైనొకరు దాడి చేసుకున్నారని చెప్పారు. ఓ చిన్న సంఘటనతో చిన్నగా మొదలైన ఘర్షణ..చివరకు దారుణంగా ఒకరిపైనొకరు దాడి చేసుకునే వరకూ వెళ్లిందన్నారు.

ముష్టి యుద్ధం

అంతేకాదు.. షాప్ లో ముష్టి యుద్ధం చేసిన వ్యక్తులు అందరూ ఒకరినొకరు తెలుసు అని అధికారులు విశ్వసిస్తున్నారని పోలీసు చీఫ్ పేర్కొన్నారు. “ఇప్పటికే ఈ గొడవలో ప్రమేయం ఉన్న కొంతమంది వ్యక్తులను గుర్తించమని ” అని చెప్పారు. ఈ వివాదం విషయంపై  వాల్‌మార్ట్ వివరణ వినడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎందుకంటే షాప్ లో జరిగిన ఈ గందరగోళంతో కొంత మేర ఆస్తి నష్టాన్ని చవిచూసింది.

అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. అంతేకాదు ఎవరూ గాయపడిన ఫిర్యాదు అందలేదు.  మరోవైపు, హింసకు గల కారణాలపై వాల్‌మార్ట్ బహిరంగంగా వెల్లడించలేదు. అయితే తన కస్టమర్ల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని పేర్కొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..