Watch Video: రంజాన్ ప్రార్థనలు చేస్తుండగా ఇమామ్ పై ఎక్కిన పిల్లి.. ఆ తర్వాత ఏం చేసిందంటే
ప్రపంచవ్యాప్తంగా ముస్లీంలకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది. దీన్ని పురస్కరించుకుని ప్రస్తుతం ముస్లీంలు ప్రత్యేక ఆచారాలు పాటిస్తూ మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అల్జీరియాలోని ఓ మసీదులో ఇమామ్ ప్రార్థనకు నాయకత్వం వహిస్తుండగా ఓ పిల్లి అతనిపై దూకిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ముస్లీంలకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది. దీన్ని పురస్కరించుకుని ప్రస్తుతం ముస్లీంలు ప్రత్యేక ఆచారాలు పాటిస్తూ మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అల్జీరియాలోని ఓ మసీదులో ఇమామ్ ప్రార్థనకు నాయకత్వం వహిస్తుండగా ఓ పిల్లి అతనిపై దూకిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో షేక్ వాలిద్ మెహసాస్ అధికారిక పేజీ ద్వారా షేర్ చేశారు. రెండు నిమిషాల నిడివి గల వీడియోలో, అల్జీరియాలోని రద్దీగా ఉండే మసీదులో పవిత్ర రంజాన్ మాసంలో రాత్రిపూట జరిగే ప్రార్థన అయిన తరావీహ్‌కు ఇమామ్ ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ చిలిపి పిల్లి అక్కడికి వచ్చింది. ముందు అతని కాళ్లలో నుంచి వెళతూ అల్లరి చేసింది. ఆ తర్వాత ఆ పిల్లి ఇమామ్‌పైకి దూకింది.
అయితే, ఇమామ్ దానిని చూసి ఆశ్చర్యపోలేదు. కళ్లు మూసుకొని తన ప్రార్థనను కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఆ పిల్లి ఆయన్ను మద్దు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత ఆయన భుజం పై నుంచి దూకి ప్రాంగణం చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటీజన్లు భిన్నమైన రీతిలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియో చూసేయండి.
Cat jumps on Imam during qiyam (taraweeh) prayers and he behaves exactly like any imam Insha’Allah would.#Ramadan pic.twitter.com/QHGXSgiZgK
— Alateeqi العتيقي (@BinImad) April 4, 2023
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..