
కారు బాంబు పేలుడుతో సిరియా దద్ధరిల్లింది. ఈ ఘటనలో కనీసం 14 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించింది. నార్త వెస్ట్‌లో ఉండే అజాజ్ నగరంలోని సెంట్రల్ సిటీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బిజీ బిజీగా ఉండే ఈ ప్రాంతంలో డిటోనేటర్లతో కారును పేల్చేశారు. దీంతో 14 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ పేలుడులో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. కాగా, ఈ ఘటనకు ఒక రోజు ముందే రక్కాలో సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ కమాండ్ సెంటర్ వద్ద కారు బాంబు పేలుడులో 10 మంది మృతిచెందారు. అయితే ఇప్పటి వరకు ఈ ఘటనకు బాధ్యులు ఎవరు అన్నది తెలియరాలేదు.