Canadian MP: ఏ దేశమేగినా.. ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.. విదేశీ గడ్డ మీద రాజకీయాలు చేస్తున్నా మూలాలను మరచిపోలేదు ఆ నాయకుడు. కెనడా ఎంపీ చంద్ర ఆర్య తమ పార్లమెంటులో కన్నడలో మాట్లాడి మాతృభాష మీద తన మమకారాన్ని చాటుకున్నారు. కర్ణాటకకు, భారత దేశానికి వెలుపల మరో దేశంలోని చట్టసభలో కన్నడ గొంతు వినిపించడం ఇదే తొలిసారి.
ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, నేను ఎల్లప్పుడూ కన్నడిగనే అంటూ సగర్వంగా చాటుకున్నారు చంద్ర ఆర్య. కెనడాలోని నేపియన్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్ర ఆర్య.. స్పీకర్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని తన మాతృభాష కన్నడలో ప్రసంగించారు. కన్నడలో మాట్లాడటం తనకు ఎంతో గర్వంగా ఉందని, ఇది ఐదు కోట్ల మంది కన్నడిగులకు ఇది గర్వకారణం అన్నారు చంద్ర ఆర్య. తన ప్రసంగంలో కన్నడ కవి కువెంపు గీతాన్ని వినిపించారు.. చంద్ర ఆర్యను ప్రసంగాన్ని కరతాళ ధ్వనులతో అభినందించారు తోటి ఎంపీలంతా.
కర్ణాటక తుంకూరు జిల్లా సిరా తాలుకాలో పుట్టారు చంద్ర ఆర్య.. బెంగళూరు యూనివర్శిటీ నుంచి ఇంజినీరింగ్, కర్ణాటక యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. చంద్ర ఆర్య DRDO, కర్ణాటక స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌లో పనిచేశారు. ఉద్యోగ రీత్యా ఖతార్‌కు, అక్కడి నుంచి కెనడాకు వెళ్లి స్థిరపడ్డారు. చంద్ర ఆర్య తొలిసారి 2015లో కెనడా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2019లో రెండవసారి విజయం సాధించారు.
I spoke in my mother tongue (first language) Kannada in Canadian parliament.
This beautiful language has long history and is spoken by about 50 million people.
This is the first time Kannada is spoken in any parliament in the world outside of India. pic.twitter.com/AUanNlkETT— Chandra Arya (@AryaCanada) May 19, 2022