అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ విషాదకర ఘటన చోటుచేసుంది. ఓ మహిళ.. ఓ చేపను తిని ఏకంగా తన కాళ్లు చేతులు పోగొట్టుకుంది. అదేంటీ చేపను తింటే కాళ్లు, చేతులు పోగొట్టుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా ?..వినడానికి ఆశ్యర్యంగా ఉన్నా ఇది నిజంగానే జరిగింది. కాకపోతే ఆ మహిళ బ్యాక్టీరియా సోకినటువంటి చేపను తింది. అయితే ఆ చేపను సరిగ్గా ఉడికించకపోవడం వల్లే ఆమెకు ఇలాంటి పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. గత వారం జరిగినటువంటి ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం అందిరినీ ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవితే అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని కాలిఫోర్నియాలో 40 ఏళ్ల వయసున్న లారా బరాజస్ అనే మహిళకు విబ్రియో వల్నిఫికస్ ప్రమాదకరమైన బ్యాక్టీరియా సోకింది. అయితే ఆ బాక్టిరియా అనేది ఎక్కువగా సముద్ర ఆహారం, సముద్రపు నీటిలో ఉంటుంది.
అయితే కాలిఫోర్నియాలోని ఆమె ఇటీవల ఓ స్థానిక మార్కెట్‌కు వెళ్లింది. అక్కడ టిలపియా అనే చేపను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లింది. ఆ తర్వాత ఆ చేపను వండుకుని తినేసింది. కానీ ఆ చేపను తిన్న తర్వాత లారా అనారోగ్యానికి గురైనట్లు ఆమె స్నేహితురాలు అన్నా మెస్సినా మీడియాకు చెప్పింది. ఆమె ప్రాణాలు పోయినంత పని అయిందని.. కొంతకాలం పాటుగా లారా రెస్పికరేటర్‌పై ఉందని తెలిపింది. అంతేకాదు వైద్యులు లారాను వైద్యపరమైన కోమాలు ఉంచినట్లు చెప్పింది. ఆమె కింది పెదవి,పాదాలు, వేళ్లు నలుపు రంగులోకి మారిపోయాయని చెప్పింది. అలాగే కిడ్నీల పనితీరు కూడా దెబ్బతిందని.. శరీరం మొత్తం విషపూరితంగా మారిపోయినట్లు పేర్కొంది. అయితే ఈ ఘటన తమపై ఎంతో ప్రభావాన్ని చూపించిందని.. ఇది మాకు ఒక భయానక అనుభవం అని చెప్పింది. ఇటువంటి పరిస్థితి ఎవరకీ కూడా రాకుడదంటూ అన్నా మెస్సినా ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. లారా కొంతకాలం పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఆ తర్వాత ఆమెకు వైద్యలు అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సను చేశారు. అయితే ఆమె ప్రాణాలు కాపాడే క్రమంలో వైద్యులు ఆమె కాళ్లూ చేతులను తొలగించేశారు. ఈ ఘటన సముద్ర ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల అవసరాన్ని చెబుతోందంటూ నిపుణలు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే రెండు రకాలుగా ఈ బాక్టిరియా సోకుతుందని తెలిపారు. ఒకటి బాక్టీరియా ఉన్న ఆహారాన్ని తినడం అయితే.. మరొకటి ఆ సూక్ష్మక్రిములు ఉన్న నీరు టాటూలు ఇతర మార్గాల గుండా శరీరంలోకి చేరడం అని యూసీఎస్‌ఎఫ్‌కు చెందిన అంటువ్యాధుల విభాగం నిపుణులు డా. నటాషా వెల్లడించారు. ఇలాంటి సముద్ర ఆహరం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచనలు చేసింది.