
అగ్రరాజ్యం అమెరికాలో గన్ కల్చర్ రోజురోజుకూ పెరిగిపోతుంది. కొందరు దుండగుల పగలు ప్రతీకారాలకు అమాయక ప్రజలు బలవుతున్నారు. ఇలాంటి ఘటనపై స్థానిక ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న వాళ్లలో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. తరచూ ఎక్కడో అక్కడ ఇలాంటి ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. ఈ దుండగుల కాల్పుల్లో భారత్ నుంచి వెళ్లిన ఎందరో విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కాలిఫోర్నియాలో బర్తడే వేడుకల్లో జరిగిన కాల్పుల్లోనూ నలుగు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఉక్కువ శాతం చిన్నారులే ఉన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. కాలిఫోర్నియాలో స్టాక్‌టన్‌లో ఆదివారం పుట్టిన రోజు వేడుకలు జరుగుతున్నాయి. ఇంతలో పార్టీలోకి వచ్చిన కొందరు వ్యక్తులు తమ చేతిలో ఉన్న తుఫాకులతో బర్త్‌డే వేడుకలు జరుపుకుంటున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ మారణహోమంలో నగులురు వ్యక్తులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా సుమారు 10 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
రక్తపు మడుగుల్లో పడిఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన క్షతగాత్రులకు చికిత్స అందించారు. మృతులు, క్షతగాత్రుల్లో ఎక్కువ మంది పిల్లలే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.