UK Visas: యువ ప్రొఫెషనల్స్‌కు ఏటా 3వేల వీసాలు.. భారతీయులకు రిషి సునాక్ గుడ్‌న్యూస్‌.. జీ20 సమ్మిట్‌ సందర్భంగా కీలక నిర్ణయం..

భారత యువ ప్రొఫెషనల్స్‌కు ఏటా 3వేల వీసాలు అందించేలా..సరికొత్త పథకానికి ఆమోదం తెలిపారు UK ప్రధాని రిషి సునాక్‌. ఇండోనేషియా బాలిలో జి-20 సదస్సు..

UK Visas: యువ ప్రొఫెషనల్స్‌కు ఏటా 3వేల వీసాలు.. భారతీయులకు రిషి సునాక్ గుడ్‌న్యూస్‌.. జీ20 సమ్మిట్‌ సందర్భంగా కీలక నిర్ణయం..
British Visas
Follow us

|

Updated on: Nov 16, 2022 | 8:36 PM

బ్రిటన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. భారత యువ ప్రొఫెషనల్స్‌కు ఏటా 3వేల వీసాలు అందించేలా..సరికొత్త పథకానికి ఆమోదం తెలిపారు UK ప్రధాని రిషి సునాక్‌. ఇండోనేషియా బాలిలో జి-20 సదస్సు వేదికగా.. ప్రధాని మోదీతో భేటీ అయిన కొద్ది గంటలకే ఈ ప్రకటన వెలువడింది. భారతీయ మూలాలున్న రిషి సునాక్‌.. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీతో భేటీ కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం బ్రిటన్, భారత్ మధ్య వ్యాపార ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇది దోహదపడుతుందని తెలిపింది బ్రిటన్‌.

ఈ పథకంలో లబ్ధి పొందే మొదటి వీసా నేషనల్ కంట్రీ భారతేనని తెలిపింది. గతేడాది ఇరు దేశాల మధ్య కుదిరిన యూకే-ఇండియా మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్‌షిప్ క్రింద ఈ పథకాన్ని రూపొందించారు. ఈ స్కీమ్‌లో భాగంగా డిగ్రీ చ‌దివిన 18 నుంచి 30 ఏళ్ల లోపు భార‌త యువ ప్రొఫెష‌న‌ల్స్ బ్రిట‌న్‌కు వ‌చ్చి ప‌నిచేస్తూ…రెండేళ్ల పాటు ఇక్కడే ఉండొచ్చని UK PMO ట్వీట్ చేసింది.

భారత్‌తో బ్రిటన్‌కు గల చారిత్రక, సాంస్కృతిక సంబంధాల గురించి తనకు తెలుసున్నారు సునాక్‌. ఈ నిర్ణయంతో అత్యంత నైపుణ్యం క‌లిగిన భార‌త్ యువ‌త.పెద్దసంఖ్యలో బ్రిట‌న్‌లో అవ‌కాశాలు పొందుతార‌ని..ఇరు దేశాల ఆర్ధిక వ్యవ‌స్ధలూ, స‌మాజాలు సుసంప‌న్నమ‌వుతాయ‌న్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం