Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్ 95వ పుట్టినరోజు నేడు.. బహిరంగ వేడుకలకు రాణీ దూరం..

|

Apr 21, 2021 | 9:40 AM

బ్రిటన్ రాణీ ఎలిజబెత్ ఈరోజు (ఏప్రిల్ 21న) 95వ పుట్టిన రోజు. అయితే క్వీ న్ ఎలిజబెత్ తన పుట్టిన రోజు వేడుకలగకు దూరంగా ఉండనుంది.

Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్ 95వ పుట్టినరోజు నేడు.. బహిరంగ వేడుకలకు రాణీ దూరం..
Queen Elizabeth
Follow us on

బ్రిటన్ రాణీ ఎలిజబెత్ ఈరోజు (ఏప్రిల్ 21న) 95వ పుట్టిన రోజు. అయితే క్వీ న్ ఎలిజబెత్ తన పుట్టిన రోజు వేడుకలగకు దూరంగా ఉండనుంది. ఇందుకు కారణం.. తన భర్త ప్రిన్స్ ఫిలిప్ ఇటీవలే మృతి చెందాడు. దాదాపు ఏడు దశాబ్దాలు కలిసి ఉన్నారు ఈ జంట. 1947లో ప్రిన్స్ పిలిప్, ఎలిజబెత్ వివాహం చేసుకున్నారు. ఏప్రిల్ 9న 99 సంవత్సరాల వయసులో ఫిలిప్ మరణించాడు. ఆయన అంత్యక్రియలు శనివారం విండ్సర్ కాజిల్‏లో నిర్వహించారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తుండడంతో అతి తక్కువ మంది ఆత్మీయుల మధ్య ఈ కార్యక్రమాలు జరిగాయి. ఫిలిప్ మరణానికి గానూ.. ఆదేశంలో రెండు వారాలు సంతాపదినాలను పాటిస్తున్నారు. ప్రతి ఏటా లండన్ టవర్ వద్ద జరిగే పుట్టిన రోజు వేడుకలు, అలాగే రాజధాని లోని హైడ్ పార్క్ వద్ద జరిగే తుపాకీ కాల్పులు ఉండవని అధికారులు తెలిపారు.

క్వీన్ ఎలిజబెత్‏కు అధికారిక పుట్టిన రోజు కూడా ఉంది. దీనిని దీనిని సాధారణంగా జూన్ రెండవ శనివారం రోజున జరుపుకుంటారు. ఫిలిప్ మరణంతో ఎలిజబెత్‏తోపాటు.. దగ్గరి ఆత్మీయులు కూడా తీవ్ర దుఃఖంలో ఉన్నారు. 69 సంవత్సరాలుగా దేశ పాలనలో ఆమె అతడికి తోడుగా ఉంది. జాత్యహంకారం, నిర్లక్ష్యం ఆరోపణలు ఆమె మనవడు ప్రిన్స్ హ్యారీ, అతని అమెరికన్ భార్య మేఘన్ ప్యాలెస్ నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియల సమయంలోనూ.. ఎలిజబెత్ ఒంటరిగానే ఉంది. అయితే రాబోయే రోజుల్లో రాణీని తన కుటుంబ సభ్యులు చూసుకుంటారని అక్కడి వార్త పత్రికలు సూచించాయి. సెంట్రల్ లండన్లోని బ్రూటన్ స్ట్రీట్లో ఏప్రిల్ 21, 1926 న జన్మించిన ఎలిజబెత్ రాణి అవుతుందని ఉహించలేదు. ఆమె తండ్రి జార్జ్ వి, అన్నయ్య ఎడ్వర్డ్ వి 1936లో వాలిస్ సింప్సన్స్ ను వివాహం చేసుకోవడానికి పదవీ విరమణ చేసినప్పుడు ఎలిజబెత్ అధికారాన్ని చేపట్టింది. ఆమె 1952 లో 25 సంవత్సరాల వయసులో సింహాసనాన్ని అధిష్టించింది. సెప్టెంబర్ 2015 లో బ్రిటన్ యొక్క సుదీర్ఘ పాలనలో ఆమె తన ముత్తాత క్వీన్ విక్టోరియాను అధిగమించింది.

Also Read: Ayushman Card: ఫ్రీగా ఆయుష్మాన్ కార్డు.. తీసుకున్నవారికి రూ.5 లక్షల బెనిఫిట్.. ఆ తేదీ వరకే ఛాన్స్..

ప్రతి సంవత్సరం రూ.36 వేలు.. కేవలం మహిళలకు మాత్రమే ఛాన్స్… ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా..