AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

13సార్లు జెండర్ మార్చుకున్న మహిళ.. విషయం తెలిసి న్యాయమూర్తి షాక్!

61 ఏళ్ల జోసెఫిన్ మోరిస్, స్నారెస్‌బ్రూక్ క్రౌన్ కోర్టులో 13 మంది పురుషులు, మహిళలకు లైఫ్ ఇన్ యుకె పరీక్షను మోసపూరితంగా రాసినట్లు అంగీకరించింది. దాని కోసం ఆమె తన వేషధారణ మార్చుకుని చట్టవిరుద్ధంగా పరీక్షలో పాల్గొన్నట్లు నేరం నిరూపణ అయ్యింది. దీంతో శిక్ష విధించేందుకు న్యాయమూర్తి సిద్ధమయ్యారు.

13సార్లు జెండర్ మార్చుకున్న మహిళ.. విషయం తెలిసి న్యాయమూర్తి షాక్!
Uk Women
Balaraju Goud
|

Updated on: Feb 26, 2025 | 11:53 AM

Share

నేరస్థులు పోలీసుల నుండి తప్పించుకోవడానికి మారువేషంలో నేరాలు చేస్తారు. లేదంటే నేరం చేసిన తర్వాత తమ మారువేషాన్ని మార్చుకుంటారని తరచుగా విని ఉండవచ్చు. అయితే బ్రిటన్‌లో విదేశీయుల పౌరసత్వం పొందడానికి ఒక మహిళ తన గుర్తింపును అనేకసార్లు మార్చుకున్న కేసు వెలుగులోకి వచ్చింది. ఒక బ్రిటిష్ మహిళ మంగళవారం(ఫిబ్రవరి 25) విగ్గు, ఇతర వేషధారణలు ధరించి డజనుకు పైగా విదేశీయులకు బ్రిటిష్ పౌరసత్వ పరీక్షను మోసపూరితంగా రాసినట్లు అంగీకరించింది.

61 ఏళ్ల జోసెఫిన్ మోరిస్, స్నారెస్‌బ్రూక్ క్రౌన్ కోర్టులో 13 మంది పురుషులు, మహిళలకు లైఫ్ ఇన్ యుకె పరీక్షను మోసపూరితంగా రాసినట్లు అంగీకరించింది. జూన్ 2022 – ఆగస్టు 2023 మధ్యకాలంలో నిజమైన దరఖాస్తుదారులలా కనిపించడానికి వారి తరపున పరీక్షకు హాజరు కావడానికి ఆ మహిళ వివిధ విగ్గులు, ఇతర వేషధారణలను ధరించిందని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో లింగ మార్పు కూడా ఉంటుంది.

ఆ మహిళ దేశవ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాలను జాగ్రత్తగా ఎంచుకుంది. మారువేషాల్లో తనిఖీల నుండి తప్పించుకోవడానికి ముందస్తు ప్రణాళికతో కూడిన ఫ్లాన్‌ను అమలు చేసిందని హోం శాఖ ఇమ్మిగ్రేషన్ అధికారి ఫిలిప్ పార్ చెప్పారు. ఈ రకమైన నేరాలు చేసే చాలా మంది నేరస్థుల మాదిరిగానే, అమె ఉద్దేశ్యం డబ్బు సంపాదించడమే అని తెలిపారు.

బ్రిటిష్ చరిత్ర, విలువలు, సమాజంపై అవగాహనను కొలిచే 24 ప్రశ్నల పరీక్షలో శాశ్వత నివాసం లేదా పౌరసత్వం పొందడానికి ఉత్తీర్ణత సాధించాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే, బ్రిటిష్ పౌరసత్వం పొందడం చాలా కష్టమవుతుంది. దీని కారణంగా వలస వచ్చిన ప్రజలు కూడా దానిని దాటడానికి చట్టవిరుద్ధమైన పద్ధతులను అనుసరిస్తారు.

ప్రస్తుతం UKలోని బ్రాంజ్‌ఫీల్డ్ జైలులో ఉన్న మోరిస్, కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరయ్యారు. దీనిలో మోరిస్ తాను ఇతరులతో కలిసి మోసం చేయడానికి కుట్ర పన్నానని ఒప్పుకున్నారు. ఇద్దరు వ్యక్తుల తాత్కాలిక డ్రైవింగ్ లైసెన్స్‌లను కలిగి ఉన్నానని ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈ కేసులో ఆమెకు మే 20న శిక్ష ఖరారు కానుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!