Kohinoor: ‘కోహినూర్’ విషయంలో బ్రిటన్‌ రాజవంశం కీలక నిర్ణయం.. భారత్‌తో దౌత్యపరమైన సంబంధాలే కారణమా..?

బ్రిటన్ రాజుగా చార్లెస్-3 పట్టాభిషేకం మరో మూడు నెలల్లో జరగబోతోంది. ఈ నేపథ్యంలో బ్రిటీష్ రాజవంశం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పట్టాభిషేకంలో కోహినూర్ వజ్రాన్ని..

Kohinoor: ‘కోహినూర్’ విషయంలో బ్రిటన్‌ రాజవంశం కీలక నిర్ణయం.. భారత్‌తో దౌత్యపరమైన సంబంధాలే కారణమా..?
Kohinoor And Queet Of Britain Camilla Parker Bowles

Updated on: Feb 15, 2023 | 4:39 PM

బ్రిటన్ రాజుగా చార్లెస్-3 పట్టాభిషేకం మరో మూడు నెలల్లో జరగబోతోంది. ఈ నేపథ్యంలో బ్రిటీష్ రాజవంశం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పట్టాభిషేకంలో కోహినూర్ వజ్రాన్ని ధరించకూడదని నిర్ణయించింది. ఈ కిరీటానికి బదులు క్వీన్ మేరీ ధరించిన మరో కిరీటాన్ని చార్లెస్-3 భార్య కెమిల్లా ధరించనున్నారు. పట్టాభిషేకం సమయంలో రాణి కెమిల్లా కిరీటధారణ కార్యక్రమంలో ఈ వజ్రాన్ని ధరించాలని తొలుత భావించినప్పటికీ.. చివరకు ఆ ఆలోచనను పక్కనపెట్టారు రాజవంశీయులు. ఈ నిర్ణయంతో క్వీన్ మేరీ ధరించిన మరో కిరీటాన్ని కెమిల్లా ధరించనున్నారు. ఈ కిరీటంలో క్వీన్ ఎలిజబెత్-2కి చెందిన నగలను కూడా పొదగనున్నారు.

ఇక క్వీన్ ఎలిజబెత్-2 కిరీటంలో కోహినూర్ వజ్రం ఉండేదని మనందరికీ తెలిసిన విషయమే. దాదాపు ఏడు దశాబ్దాల పాటు అంటే.. ఎలిజబెత్-2 మరణించే రోజు దాకా ఆమె కిరీటంలో ఈ కోహినూర్ వజ్రం ఉంది. కోహినూర్ వజ్రం మన దేశానికి చెందినది అనే విషయం మనలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ కోహినూర్ మన ఆంధ్రప్రదేశ్‌లోనే లభ్యమైంది. ఈ నేపథ్యంలోనే భారత్‌తో దౌత్యపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే కోహినూర్‌ను ధరించకూడదని రాణి కెమిల్లా, ఇంకా బ్రిటన్ రాజవంశీయులు నిర్ణయించినట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us