Prince Philip death: బ్రిటన్ ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు.. లండన్ చేరిన మనవడు హ్యారీ

|

Apr 16, 2021 | 3:07 PM

వస్తారో.. రారో అనుకున్నారు అందరూ. కానీ, యువరాజు హ్యారీ వచ్చారు. తన తాతగారి అంత్యక్రియలకు హాజరయ్యారు.

Prince Philip death: బ్రిటన్ ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు.. లండన్ చేరిన మనవడు హ్యారీ
Prince Philip
Follow us on

Prince Philip death: వస్తారో.. రారో అనుకున్నారు అందరూ. కానీ, యువరాజు హ్యారీ వచ్చారు. తన తాతగారి అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ విషయాన్ని యూకే మీడియా సోమవారం వెల్లడించింది. బ్రిటిష్ ప్రిన్స్ ఫిలిప్, క్వీన్ ఎలిజబెత్ II భర్త డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ శుక్రవారం ఉదయం కన్ను మూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఆదివారం జరిగాయి. ఈ అంత్యక్రియలకు లాస్ ఏంజిల్స్ లో ఉంటున్న ఆయన మనవడు హాజరవుతారా లేదా అనే విషయంలో సందిగ్దత నెలకొంది. అయితే, 36 ఏళ్ల ప్రిన్స్ హ్యారీ బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానంలో లాస్ ఏంజెల్స్ నుంచి లండన్ లోని హీత్రూ విమానాశ్రయానికి శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా అయన కెన్సింగ్ టన్ ప్యాలెస్ కు వెళ్లారు.

అయితే, ప్రిన్స్ హరీ భార్య మేఘన్ మార్కెల్ ఈ అంత్యక్రియలకు హాజరు కాలేదు. గర్భవతి కావడంతో వైద్యులు ఆమెను ప్రయాణాలు చేయడం మంచిది కాదని చెప్పడంతో ఆమె రాలేదు. ప్రిన్స్ హ్యారీ లండన్ లో పది రోజులు క్వారంటైన్ అవడానికి అవకాశం లేదు. అయితే, అక్కడ ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ నిబంధనల ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సెల్ఫ్ ఐసోలేషన్ నుంచి ఎవరైనా బయటకు రావచ్చు. అందులోనూ కుటుంబీకుల అంత్యక్రియల సమయంలో ఈ నిబంధన వర్తిస్తుంది. కానీ, ఆయన లండన్ బయలుదేరే ముందు కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. అదేవిధంగా ఆయన తిరిగి వెళ్ళేటపుడు కూడా కోవిడ్ పరీక్షలు చేయించుకుంటారని బ్రిటిష్ రాజభవన్ ప్రతినిధులు తెలిపారు.

ఇక బ్రిటిష్ రాజు ఫిలిప్ అంత్యక్రియలకు కరోనా ఎఫెక్ట్ తగిలింది. కరోనా నిబంధనల కారణంగా కేవలం 30 మంది రాజకుటుంబీకుల సన్నిహితుల మధ్యలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఈ అంత్యక్రియలకు హాజరు కావడంలేదు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాజకుటుంబం నుంచి ఒకరు అధికంగా హాజరయ్యే అవకాశం కల్పించడం కోసం ఆయన హాజరు కావడంలేదని చెబుతున్నారు.

Also Read: China Intelligence: నక్కజిత్తుల చైనా.. గూఢచర్యంలోనూ మహా తెలివితేటలు..ప్రపంచంలోని విషయాలు ఎలా సేకరిస్తోందో తెలుసా?

Corona Vaccine: వ్యాక్సిన్ వేయించుకున్నా మాస్కులు పెట్టుకుంటేనే కరోనా తీవ్రతను సమర్ధంగా అడ్డుకోగలం..అమెరికా పరిశోధనల్లో వెల్లడి