Brics: తాలిబన్లను ఓ కంట కనిపెట్టండి.. బ్రిక్స్‌ దేశాలకు ప్రధాని మోడీ కీలక సూచన..

|

Sep 10, 2021 | 9:08 AM

Brics: తాలిబన్లను ఓ కంట కనిపెట్టాలి.. లేదంటే పెనుప్రమాదం తప్పదని ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్‌ దేశాల సదస్సు అభిప్రాయపడింది. అమెరికా మిత్రదేశాలు అర్ధాంతరంగా బలగాలను ఉపసంహరించుకోవడంతోనే..

Brics: తాలిబన్లను ఓ కంట కనిపెట్టండి.. బ్రిక్స్‌ దేశాలకు ప్రధాని మోడీ కీలక సూచన..
Brics Leaders
Follow us on

తాలిబన్లను ఓ కంట కనిపెట్టాలి.. లేదంటే పెనుప్రమాదం తప్పదని ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన బ్రిక్స్‌ దేశాల సదస్సు అభిప్రాయపడింది. అమెరికా మిత్రదేశాలు అర్ధాంతరంగా బలగాలను ఉపసంహరించుకోవడంతోనే ఆఫ్ఘన్‌ ప్రజలకు ఈ కష్టాలు వచ్చాయన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్‌. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బ్రిక్స్‌ దేశాల సదస్సు జరిగింది. ఆఫ్ఘన్‌ పరిణామాలతో పాటు కరోనా నియంత్రణపై ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది. వర్చువల్ భేటీకి రష్యా , చైనాతో పాటు బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా దేశాధినేతలు హాజరయ్యారు.

15ఏళ్లలో బ్రిక్స్‌ కూటమి మరింత శక్తివంతంగా తయారుకావాలని అన్నారు ప్రధాని మోడీ. తాలిబన్లతో ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పును బ్రిక్స్‌ కూటమికి గుర్తు చేశారు ప్రధాని మోడీ. బ్రిక్స్‌ సదస్సులో కీలక వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్‌.

అమెరికా మిత్రదేశాలు అర్ధాంతరంగా బలగాలను ఉపసంహరించుకోవడంతోనే ఆఫ్ఘన్‌ ప్రజలకు కష్టాలు వచ్చాయన్నారు. తాలిబన్ల పాలనపై నిరంతరం నిఘా పెట్టాలని.. ఉగ్రవాదులకు అడ్డాగా ఆ దేశం మారకుండా చూడాల్సిన బాధ్యత బ్రిక్స్‌ దేశాలపై ఉందన్నారు పుతిన్‌.

ఆఫ్ఘన్‌ ప్రజల కష్టాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిక్స్‌ సదస్సుకు హాజరైన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కరోనా నియంత్రణ పైనే మాట్లాడారు. తాలిబన్ల ఊసెత్తకుండా వాళ్లకు పరోక్షంగా మద్దతు తెలిపారు.

ఇవి కూడా చదవండి: Vinayaka Chavithi: ఎలాంటి విఘ్నాలు లేకుండా.. విఘ్నేశ్వరుడికి తొలిపూజ ఇలా చేద్దాం..

Vinayaka Chavithi: గణపయ్యకు అమ్మవారు ప్రాణం పోసింది ఇక్కడే.. ఈ దేవ భూమి చేరుకోవాలంటే..