Boat Accident: భారత్ – శ్రీలంక సముద్ర జలాల సరిహద్దుల్లో బోట్లు ఢీ.. ఐదుగురు మృతి..

|

Jan 22, 2021 | 7:38 AM

Boat Accident: భారత్ - శ్రీలంక సముద్ర జలాల సరిహద్దుల్లో ఇరు దేశాలకు చెందిన ఓట్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో భారత్‌కు చెందిన ముగ్గురు..

Boat Accident: భారత్ - శ్రీలంక సముద్ర జలాల సరిహద్దుల్లో బోట్లు ఢీ.. ఐదుగురు మృతి..
Follow us on

Boat Accident: భారత్ – శ్రీలంక సముద్ర జలాల సరిహద్దుల్లో ఇరు దేశాలకు చెందిన ఓట్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో భారత్‌కు చెందిన ముగ్గురు భారత జాలర్లు, ఒక శ్రీలంక జాలరి మృతి చెందారు. కోస్ట్‌గార్డ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీలంక, భారత దేశానికి చెందిన జాలర్లు తమ తమ బోట్లపై సముద్ర జలాల్లో చేపల వేటకు వెళ్లారు. అయితే, శ్రీలంకకు చెందిన బోటు సరిహద్దు రేఖ దాటి భారత జలాల్లోకి చొచ్చుకొచ్చింది. ఈ క్రమంలో ఇరు దేశాల జాలర్ల బోట్‌లు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు బోడ్డు పూర్తిగా ధ్వంసమయ్యారు. కాగా, భారత్‌కు చెందిన ముగ్గురు జాలర్లు మృతి చెందగా, శ్రీలంకకు చెందిన ఒక మత్స్యకారుడు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ప్రమాద సమాచారాన్ని శ్రీలంక నేవీ అధికారులకు భారత నేవీ అధికారులు చేరవేశారు. ఇదే సమయంలో సరిహద్దు నిబంధనలను అతిక్రమించరదాని హెచ్చరించారు.

Also read:

Passport based ‘Dharani’ : పాస్‌పోర్టు ఆధారంగా ‘ధరణి’ పాస్‌బుక్‌.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం

Mysterious Blast : క‌ర్ణాట‌క‌ శివ‌మొగ్గ‌లో భారీ పేలుడు.. 8 మందికి పైగా మృతి..జిలటిన్ స్టిక్కులు తీసుకెళ్తుండగా ఘటన