Russia – Ukraine: ఈ పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు.. ఉక్రెయిన్ – రష్యా యుద్ధంపై ఆందోళన

|

May 25, 2022 | 9:15 PM

నెలలు గడుస్తున్నా ఉక్రెయిన్(Ukraine) పై రష్యా చేస్తున్న దాడులు తీవ్ర ఉద్రిక్తంగా జరుగుతోంది. అయితే ఈ యుద్ధంపై బిలియనీర్ జార్జ్ సోరోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా - ఉక్రెయిన్ యుద్దం మూడో ప్రపంచ యుద్ధానికి నాంది కావొచ్చని...

Russia - Ukraine: ఈ పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు.. ఉక్రెయిన్ - రష్యా యుద్ధంపై ఆందోళన
Russia Ukraine War
Follow us on

నెలలు గడుస్తున్నా ఉక్రెయిన్(Ukraine) పై రష్యా చేస్తున్న దాడులు తీవ్ర ఉద్రిక్తంగా జరుగుతోంది. అయితే ఈ యుద్ధంపై బిలియనీర్ జార్జ్ సోరోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా – ఉక్రెయిన్ యుద్దం మూడో ప్రపంచ యుద్ధానికి నాంది కావొచ్చని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చైనా(China) అధ్యక్షుడు జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ బంధానికి అవధులు లేవని అన్నారు. ఈ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించడానికి ప్రపంచమంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ యుద్ధం ఆకస్మాత్తుగా వచ్చింది కాదని, ఇందుకు సంబంధించిన సమాచారం పుతిన్‌ చాలా కాలం క్రితమే జిన్‌పింగ్‌ (Xi Jinping)కు తెలియజేశారని అన్నారు. శీతాకాల ఒలింపిక్స్‌ సందర్భంగా ఇరువురు భేటీ అయి ఫిబ్రవరి 4న సుదీర్ఘ ప్రకటన చేశారని చెప్పారు. జిన్‌పింగ్‌ కొవిడ్‌ను ఎదుర్కొన్న తీరు పై సోరోస్‌ తీవ్ర విమర్శలు చేశారు. వుహాన్‌ వేరియంట్‌ కోసం తయారు చేసిన టీకాలను చైనా ప్రజలకు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు.

ఉక్రెయిన్‌లో సైనిక చర్య పుతిన్‌ ఊహించినట్లుగా సాగడం లేదు. రష్యన్‌ సైనికులు మిలిటరీ డ్రస్సులు తీసుకెళ్లారు. కానీ, పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌పై దాడి చేసి తప్పు చేశానని పుతిన్‌కు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అందుకే ఆయన కాల్పుల విరమణ ఒప్పందం కోసం వేదికను సిద్ధం చేసుకుంటున్నారు. శాంతి చర్చలు పుతిన్‌ నుంచే ప్రారంభం కావాల్సి ఉంటుంది. అంతే కాకుండా చైనాలోనూ జిన్‌పింగ్‌ ప్రాబల్యం తగ్గుతోంది.

           – జార్జ్ సోరోస్

ఇవి కూడా చదవండి

మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై హత్యాయత్నం జరిగినట్లు ప్రచారం మొదలైంది. రెండు నెలల క్రితం పుతిన్‌ ఓ దాడి నుంచి తప్పించుకొన్నట్లు ఉక్రెయిన్‌ రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్‌ డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం అధిపతి కైర్‌యలో స్కై న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు. కాకసస్‌ పర్యటనలో ఉన్న సమయంలో అక్కడి ప్రతినిధులు పుతిన్‌పై దాడి చేసినట్లు బుద్‌నోవ్‌ పేర్కొన్నారు. ఈ దాడి నుంచి పుతిన్‌ సురక్షితంగా తప్పించుకొన్నారని వెల్లడించారు. కాకపోతే ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలైన తొలినాళ్లలోనే ఈ దాడి జరిగినట్లుగా వెల్లడించారు.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి