UNESCO: భగవద్గీతకు, నాట్యశాస్త్రానికి అంతర్జాతీయ గుర్తింపు.. ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ క్షణం

అంతర్జాతీయ విపణిలో మారోసారి భారతదేశ నాగరికత వారసత్వం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. భగవద్గీత ... నాట్యశాస్త్రం యునెస్కోలోని మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో చేర్చబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్యుమెంటరీ వారసత్వ జాబితాలో చోటు దక్కిమ్చుకుని ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలిచాయి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర సంస్కృతి , పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు.

UNESCO: భగవద్గీతకు, నాట్యశాస్త్రానికి అంతర్జాతీయ గుర్తింపు.. ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ క్షణం
Bhagavad Gita Natyashastra

Updated on: Apr 18, 2025 | 1:20 PM

భారతదేశ నాగరిక వారసత్వానికి గణనీయమైన గుర్తింపుని హిందువుల పవిత్ర గ్రంధం శ్రీమద్ భగవద్గీత.. భరత ముని నాట్యశాస్త్రం తీసుకొచ్చాయి. తాజాగా ప్రతి భారతీయుడు గర్వపడేలా యునెస్కోకి చెందిన మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో తమకంటూ ఓ పేజీని లిఖించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్యుమెంటరీ వారసత్వ జాబితాలో భగవద్గీత, నాట్యశాస్త్రం రిజిస్టర్లో చేర్చారని కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేశారు. ఇది అపురూపమైన ఘట్టం అని.. “భారత నాగరికత వారసత్వానికి చారిత్రాత్మక క్షణం” అని అభివర్ణించారు. “ఈ కాలాతీత రచనలు సాహిత్యం.. విలువైన సంపద అని చెప్పారు.

ఈ గ్రంథాలు జీవన సారం అని.. మనం ఆలోచించే, అనుభూతి చెందే, జీవించే , వ్యక్తీకరించే విధానాన్ని రూపొందించిన తాత్విక..సౌందర్య పునాదులు అని వీటిని ప్రాముఖ్యతను చెప్పారు. అంతేకాదు మనదేశానికి ప్రపంచ దృష్టికోణాన్ని ఆవిష్కరిస్తారని.. గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు ఈ ప్రపంచ డాక్యుమెంటరీ వారసత్వం రిజిస్టర్‌లో భారతదేశం ఇప్పుడు 14 ఎంట్రీలను కలిగి ఉందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

 

మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో చోటు దక్కించుకోవడం పై మన ప్రధాన మంత్రి మోడీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి గర్వకారణమైన క్షణం అని అన్నారు. అంతేకాదు యునెస్కో మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో గీత, నాట్యశాస్త్రలు రిజిస్టర్ అవ్వడం.. మన కాలాతీత జ్ఞానం, గొప్ప సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా దక్కిన గుర్తింపు అని చెప్పారు మోడీ. ఇవి శతాబ్దాలుగా నాగరికతను, చైతన్యాన్ని పెంపొందించాయి. ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి అని మోడీ తెలిపారు.

 

ప్రపంచ ప్రాముఖ్యత.. అసాధారణమైన సార్వత్రిక విలువలే ఎంపికకు ప్రమాణాలు. దీనికి అనుగుణంగా అంతర్జాతీయ సలహా కమిటీ సిఫార్సు చేసిన.. కార్యనిర్వాహక బోర్డు ఆమోదించిన డాక్యుమెంటరీ వారసత్వాన్ని మెమరీ ఆఫ్ ది వరల్డ్ (MoW) రిజిస్టర్ జాబితా చేస్తుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..