Barack Obama: ఎంతో మంది సెలబ్రెటీలను వెనక్కి నెట్టి.. ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. ఎందుకో తెలుసా..

|

Sep 04, 2022 | 5:30 PM

అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎమ్మీ పురస్కారాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామాకు దక్కింది. ఎంతోమంది ప్రముఖ సెలబ్రెటీలు ఈఅవార్డు కోసం పోటీ పడగా ఒబామాకు ఈపురస్కారానికి ఎంపికయ్యారు. నెట్​ఫ్లిక్స్​ డాక్యుమెంటరీ "అవర్​ గ్రేట్​ నేషనల్​ పార్క్స్​"లో ఆయన చేసిన..

Barack Obama: ఎంతో మంది సెలబ్రెటీలను వెనక్కి నెట్టి.. ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. ఎందుకో తెలుసా..
Obama
Follow us on

Barack Obama: అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఎమ్మీ పురస్కారాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామాకు దక్కింది. ఎంతోమంది ప్రముఖ సెలబ్రెటీలు ఈఅవార్డు కోసం పోటీ పడగా ఒబామాకు ఈపురస్కారానికి ఎంపికయ్యారు. నెట్​ఫ్లిక్స్​ డాక్యుమెంటరీ “అవర్​ గ్రేట్​ నేషనల్​ పార్క్స్​”లో ఆయన చేసిన నరేషన్​కు ఈ ఎమ్మీ అవార్డు దక్కింది. ఎందరో సెలబ్రెటీలను వెనక్కి నెట్టి.. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామాకు ఈపురస్కారాన్ని గెలుచుకున్నారు. వినోద రంగంలో నాలుగు పురస్కారాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. వాటిలో ఎమ్మీ, గ్రామీ, ఆస్కార్​, టోనీ అవార్డులు. బరాక్​ ఒబామా వద్ద ఇప్పటికే రెండు గ్రామీ అవార్డులు ఉండగా.. తాజాగా ఆయనకు ఉన్న అవార్డుల జాబితాలోకి ఎమ్మీ కూడా చేరింది. ఇక ఆస్కార్​, టోనీ అవార్డులు కూడా వస్తే.. ఎమ్మీ, గ్రామీ, ఆస్కార్​, టోనీ(EGOT) పురస్కారాలు దక్కించుకున్న జాబితాలోకి బరాక్ ఒబామా చేరుతారు.

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేవలం 17మంది మాత్రమే ఈజీఓటీ జాబితాలోకి చేరారు.’అవర్​ గ్రేట్​ నేషల్​ పార్క్స్’​ అనే డాక్యుమెంటరీని హైయర్​ గ్రౌండ్​ ప్రొడక్షన్స్​, బరాక్​ అండ్​ మిచెల్​ ఒబామా ప్రొడక్షన్​ కంపెనీలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రపంచంలోని నేషనల్​ పార్కులపై ఈ డాక్యుమెంటరీని తీశారు. అమెరికాకు అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తులు ఈఅవార్డును పొందడం ఇది రెండోసారి. 1956లో.. డ్వైట్​ డీ ఐసిన్​హౌవర్​.. స్పెషల్​ ఎమ్మీ అవార్డును స్వీకరించారు. తాజాగా.. బరాక్​ ఒబామాకు ఎమ్మీ అవార్డు దక్కింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..