Bangladesh: ఎన్నికలవేళ భారత్‎పై బంగ్లాదేశ్ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా సుదీర్ఘకాలం సేవలందించారు. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు జరుగుతున్న వేళ నాల్గవ సారి ప్రధాని అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ సందర్భంగా భారత్ పై ఆసక్తికర వ్యాక్యలు చేశారావిడ. బంగ్లాదేశ్‌కు భారతదేశం నమ్మకమైన మిత్రదేశం అన్నారు. బంగ్లాదేశ్‌లో నేడు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) బహిష్కరించింది.

Bangladesh: ఎన్నికలవేళ భారత్‎పై బంగ్లాదేశ్ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..
Bangladesh Prime Minister

Updated on: Jan 07, 2024 | 8:16 PM

షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా సుదీర్ఘకాలం సేవలందించారు. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు జరుగుతున్న వేళ నాల్గవ సారి ప్రధాని అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ సందర్భంగా భారత్ పై ఆసక్తికర వ్యాక్యలు చేశారావిడ. బంగ్లాదేశ్‌కు భారతదేశం నమ్మకమైన మిత్రదేశం అన్నారు. బంగ్లాదేశ్‌లో నేడు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) బహిష్కరించింది. దీంతో అధికార అవామీ లీగ్ నాయకురాలు హసీనా గెలుపు లాంఛనమైంది. ప్రధానమంత్రిగా షేక్ హసీనా వరుసగా నాలుగోసారి గెలుపొందడం చాలా ఆసక్తికరమైన పరిణామం. ఈ విజయంతో అవామీ లీగ్‌ పార్టీ ఐదవ సారి విజయం సాధించింది. ఈ విజయం భారతదేశానికి ఎంతో అవసరం. బంగ్లాదేశ్ ఎన్నికలను భారత్‌తో పాటు పొరుగు దేశాలు కూడా నిశితంగా గమనిస్తున్నాయి. షేక్ హసీనా నాయకత్వంలో, కాలక్రమేణా రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. రెండు దేశాలు సుదీర్ఘ కాలంగా సరిహద్దును పంచుకుంటున్నాయి. అలాగే రెండు దేశాల మధ్య ఆర్థిక, సామాజిక స్థిరత్వం మరింత బలపడేందుకు దోహదపడుతుంది.

బంగ్లాదేశ్.. పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాంతో సరిహద్దును పంచుకుంటుంది. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా షేక్ హసీనా పదవీలో ఉన్నంతకాలం తిరుగుబాటుదారులు, ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు తావివ్వకుండా.. వారికి వ్యతిరేకంగా కఠినమైన విధానాలతో పాలన సాగించారు. దీంతో భారత్ తన భద్రతా బలగాలను అటువైపు సడలించేందుకు దోహదపడింది. అయితే షేక్ హసీనా నాల్గవ సారి ప్రధాని అయిన సందర్భంగా భారత్ పై ఆసక్తికర వ్యాక్యలు చేశారు. బంగ్లాదేశ్‌కు భారతదేశం నమ్మకమైన మిత్రదేశం అన్నారు. 1971లో జరిగిన విముక్తి యుద్ధంలో బంగ్లాదేశ్ ప్రజలకు ఆశ్రయం ఇచ్చింది భారతదేశమేనని చరిత్రను గుర్తు చేశారు. అందుకుగాను భారతదేశ ప్రజలకు మా శుభాకాంక్షలు అని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..