Balakrishna: అమెరికాలో ట్రంప్‌ విజయం.. బాలయ్య రియాక్షన్ ఏంటంటే?

|

Nov 06, 2024 | 11:41 PM

US Presidential Elections: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ విజయం సాధించాడు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు అందుకొనున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల నుంచి అభినందనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ట్రంప్‌ విజయంపై బాలకృష్ణ స్పందించాడు.

Balakrishna: అమెరికాలో ట్రంప్‌ విజయం.. బాలయ్య రియాక్షన్ ఏంటంటే?
Balakrishna Congratulates Trump
Follow us on

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి రెండోవసారి అధ్యక్షుడు కాబోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికల్లో ట్రంప్ విజయం భారత్ అమెరికా సంబంధాలలో కొత్త శకానికి నాందిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్ అమెరికా మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని అశిస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజల సంక్షేమం కోసం ట్రంప్ సహకరించాలని కోరారు.

అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ కూడా డొనాల్డ్ ట్రంప్‌కి అభినందనలు తెలియజేశారు. ట్రంప్‌ను “అద్వితీయమైన మొండితనం ట్రంప్‌ను గెలిపించింది” అని అభివర్ణించారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్‌తో యుఎస్ ఎన్నికల విజయం తర్వాత ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తుంది. ఇజ్రాయెల్ భద్రతకు “ఇరానియన్ ముప్పు” గురించి చర్చించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. వారిద్దరి మధ్య సంభాషణ స్నేహపూర్వకంగా జరిగినట్లు తెలుస్తుంది. “ట్రంప్ ఎన్నికల విజయంపై ప్రధాని నెతన్యాహు అభినందనలు తెలిపారు. ఇజ్రాయెల్ భద్రత కోసం ఇద్దరూ కలిసి పనిచేయడానికి అంగీకరించారు, “ఇరాన్ ముప్పు గురించి కూడా చర్చించారు,” అని నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా శుభాకాంక్షలు తెలిపారు. డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల విజయం తర్వాత అమెరికాతో సంబంధాలలో “కొత్త అధ్యాయం” కోసం ఆశిస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం బుధవారం తెలిపింది. భవిష్యత్ ట్రంప్ పరిపాలన “రెండు దేశాల మధ్య సంబంధాలలో ఖచ్చితమైన పురోగతికి వాస్తవిక చర్యలు తీసుకుంటుందని మరియు రెండు దేశాల సంబంధాలలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది ” అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ కహర్ బల్ఖీ X లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల విజయాన్ని ఇన్వెస్టర్లు మళ్లీ అంచనా వేయడంతో యూరోపియన్ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం భారీ లాభాలతో పడిపోయాయి. లండన్ 0.1 శాతం పడిపోయింది, అయితే ట్రంప్ విజయం తర్వాత ఫ్రాంక్‌ఫర్ట్ 0.9 శాతం పడిపోయింది.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి