కజకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరగింది. అజర్‌బైజాన్ నుంచి రష్యా వెళ్తున్న ఓ విమానం కుప్పకూలింది. విమానంలో దాదాపు 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అజర్‌బైజాన్‌లోని బాకు నుంచి రష్యాలోని చెచ్న్యా రాజధాని గ్రోజ్నీకి విమానం వెళుతోంది. పక్షుల గుంపును ఢీకొనడంతో విమానం దెబ్బతింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసే క్రమంలో రన్‌వేపై ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు.
ప్రమాదానికి గురైన విమానం అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందినదిగా అధికారులు ప్రకటించారు. కూలిపోయిన విమానంలో 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారని కజకిస్థాన్ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారని కజకిస్థాన్ ఆరోగ్య మంత్రి తెలిపారు. విమానాన్ని, పక్షుల గుంపును ఢీకొనడమే ప్రమాదానికి కారణమని విమానయాన సంస్థ తెలిపింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బయటపడింది. ఇందులో విమానం నేలపై కూలిపోయి అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంపై అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
First video has appeared from the crash site of the Azerbaijan Airlines plane in Kazakhstan's Aktau.
The plane was traveling from Baku to Grozny, and reportedly requested emergency landing before the tragedy happened. pic.twitter.com/PTi1IWtz1w
— RT (@RT_com) December 25, 2024
రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తున్న విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి ముందు గాల్లోనే పలుమార్లు చక్కలు కొట్టింది. ఈ క్రమంలోనే పలుమార్లు గాల్లో చక్కర్లు కొట్టాక.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కి ప్రయత్నించిన టైమ్‌లో ప్రమాదం జరిగింది. రన్‌వేను తాకుతుండగానే ఫ్లైట్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
మరిన్ని అంర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..