Australia: ఇండియా విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం.. మే 15 వరకు వారంతా భారత్‌లోనే..

|

Apr 27, 2021 | 11:57 AM

Australia suspends India flights: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు నమోదవుతుండగా.. వేలాది మంది

Australia: ఇండియా విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం.. మే 15 వరకు వారంతా భారత్‌లోనే..
Australia suspends India flights
Follow us on
Australia suspends India flights: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు నమోదవుతుండగా.. వేలాది మంది మరణిస్తున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే పలు దేశాలు భారత్ నుంచి వెళ్లే విమానాలపై నిషేధం విధించాయి. తాజాగా విమానాల‌ను నిషేధించిన జాబితాలో ఆస్ట్రేలియా కూడా చేరింది. దేశంలో క‌రోనా కేసులు భారీ పెరిగిపోతుండ‌టంతో ఇత‌ర దేశాలు ఇండియా నుంచి వెళ్లే ప్ర‌యాణికుల‌ను త‌మ దేశాల్లోకి అనుమ‌తించ‌డం లేదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కూడా మే 15వ తేదీ వ‌ర‌కూ ఇండియా నుంచి నేరుగా వ‌చ్చే ప్ర‌యాణికుల విమానాల‌పై తాత్కాలిక నిషేధం విధిస్తున్న‌ట్లు మంగ‌ళ‌వారం వెల్లడించింది. ఆతర్వాత మరలా నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొంది.
ఇండియా నుంచి వైర‌స్‌ ముప్పు పొంచి ఉన్న కార‌ణంగానే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆస్ట్రేలియా ప్ర‌ధాని స్కాట్ మోరిస‌న్ పేర్కొన్నారు. ఈ నిర్ణ‌యంతో ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియా క్రికెట‌ర్ల‌తోపాటు కొన్ని వేల మంది ఆ దేశ‌స్థులు భారత్‌లోనే చిక్కుకుపోనున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్లు మొద‌టి నుంచి ఈ నిర్ణ‌యం వెలువ‌డుతుంద‌నే ఆందోళ‌న‌లోనే ఉన్నారు. ఈ క్రమంలో ఇప్ప‌టికే ముగ్గురు క్రికెటర్లు ఇంటికి వెళ్లిపోగా.. వార్న‌ర్‌, స్మిత్ స‌హా మిగిలిన వాళ్లంతా వెళతారన్న వార్త‌లు వ‌చ్చాయి. వారు ఇంకా వెళ్లలేదు. తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. మే 15 వ‌ర‌కైనా వారికి ఆ అవ‌కాశం లేకుండా పోయింది. అయితే ఆ తర్వాత పరిస్థితులకనుగుణంగా మరలా ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Also Read:

COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్ ధరలను తగ్గించండి.. సీరం, భారత్ బయోటెక్‌లను కోరిన కేంద్ర ప్రభుత్వం..

‘సాయానికి సిధ్దం, మా కోసం ఇండియా, వారి కోసం మేం,’ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్,