Australia Immediately Lockdown Due To One Man: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మిగిల్చిన విషాధం అంతా ఇంత కాదు.. వైరస్ దాటికి ప్రపంచదేశాలు లాక్‌డౌన్ దిశగా వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి.
కానీ కొన్ని దేశాల్లో మాత్రం వైరస్ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. బ్రిటన్ కేంద్రంగా పుట్టుకొచ్చిన కొత్త రకం స్ట్రెయిన్ వైరస్ కారణంగా కొన్ని దేశాలు ఇంకా భయంలోనే ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ కొత్త రకం వైరస్ ఆస్ట్రేలియాను మరోసారి లాక్‌డౌన్‌లోకి వెళ్లేలా చేసింది. ఇటీవల ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలోని విమానాశ్రయంలోని ఓ క్వారంటైన్ హోటల్ సిబ్బందిలో ఒకరికి యూకే వైరస్ పాజిటివ్‌గా తేలింది. ఈ హోటల్‌లో ప్రతీ వారానికి 1500కిపైగా పర్యాటకులు వస్తుండడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక్కసారిగా అలెర్ట్ అయ్యింది. వెంటనే అత్యవసరంగా లాక్‌డౌన్‌ను విధించారు. దీంతో ఆస్ట్రేలియాలో రెండో అతి పెద్ద నగరమైన మెల్ బోర్న్‌లో దాదాపు ఐదు మిలియన్ల మంది ఐదు రోజుల పాటు ఇళ్లలోనే ఉండిపోయారు. ఇదిలా ఉంటే.. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభమైంది. నగరమంతా లాక్‌డౌన్ విధించడంతో ప్రేక్షకులు లేకుండానే టోర్నీని నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్లు కొన్న వారికి డబ్బు తిరిగి చెల్చించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Also Read: TikTok Star: ఇన్‌స్టాగ్రమ్‌లో వీడియో పోస్ట్.. ఆ వెంటనే ఆత్మహత్యకు పాల్పడిన ప్రముఖ టిక్ టాక్ స్టార్..