ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ని 60 ఏళ్లకు పైబడినవారికి ఇవ్వరాదని యూరోపియన్ యూనియన్ డ్రగ్ రెగ్యులేటరీ సంస్థ సూచించింది. ఈ టీకామందు ఇచ్చినందువల్ల వారిలో అరుదైన బ్లడ్ క్లాటింగ్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్న ఆందోళన వివిధ దేశాల్లో మొదలైందని ఈ సంస్థ వెల్లడించింది. ఇటీవలి వరకు 55 నుంచి 65 ఏళ్ళ లోపువారికి ఆస్ట్రాజెనికా ఇవ్వరాదని ప్రకటించిన ఈ మెడికల్ ఏజన్సీ.. ఇప్పుడు 60 ఏళ్ళు దాటినవారికి కూడా ఇది ఇవ్వడం సముచితం కాదని పేర్కొంటోంది. ఈ మేరకు ఈయూలోని అన్ని సభ్యదేశాలకు సూచనలు చేసింది. కొంతమంది యువతలో వచ్చిన బ్లడ్ క్లాటింగ్ వంటి రుగ్మతలే వీరిలోనూ ఏర్పడ్డాయని… ఈ లక్షణాలతో పలువురు ఆసుపత్రుల్లో చేరుతున్నారని ఈ రెగ్యులేటరీ వివరించింది. అంటే దాదాపు అన్ని వయస్సులవారికి రిస్క్ ఉంటోందని కోవిద్ టాస్క్ ఫోర్స్ చీఫ్ మార్క్ కేవల్రీ అంటున్నారు. ఫ్రాన్స్, జర్మనీ దేశాలు 60 ఏళ్ళు పైబడినవారికి ఈ టీకామందును ఇవ్వడం నిలిపి వేశాయన్నారు.
తాజాగా ఇటలీ కూడా ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో కోవిద్ కేసులు తగ్గుతున్నందున మళ్ళీ యువతకు ఈ వ్యాక్సిన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కేవల్రీ చెప్పారు. నిజానికి మొదట ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ బాగానే పాపులర్ అయింది. అయితే తొలుత మెక్సికో వంటి దేశాల్లో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్టు ఆ మధ్య నిపుణులు నిర్వహించిన స్టడీ పేర్కొంది. ఈ కారణంగా అప్పుడే కొన్ని దేశాల్లో దీని అత్యవసర వినియోగాన్ని నిలిపివేశారు.
ఇప్పుడు తాజాగా 60 ఏళ్ళు పైబడినవారికి ఇవ్వరాదని అంటున్నారు. వ్యాక్సిన్ల విషయంలో ఎందుకింత అయోమయం, గందరగోళం ఏర్పడుతున్నాయో అర్థం కావడంలేదని పలువురు విశ్లేషకులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అన్ని క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైన తరువాతే వీటి అత్యవసర వినియోగానికి ఆయా రెగ్యులేటరీలు అనుమతులు ఇస్తున్న విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Dragan Warning: జీ7 దేశాలను డ్రాగన్ వార్నింగ్.. చిన్న కూటములతో ప్రపంచాన్ని నిర్దేశించలేరన్న చైనా