America’s quietest town: ఆ నగరంలో స్మార్ట్ ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులు వాడితే జైలుకే..! రీజన్ ఏమిటో తెలిస్తే షాక్..

|

Nov 09, 2023 | 10:07 AM

అమెరికాలోని ఓ నగరంలో సెల్ ఫోన్ పై నిషేధం అమల్లో ఉంది. వెస్ట్ ఆఫ్ అమెరికాలోని వర్జీనియాలోని పోకాహోంటాస్ కౌంటీలో ఉన్న గ్రీన్ బ్యాంక్ సిటీలోని ప్రజలు సాంకేతికతను ఉపయోగించరు. ఈ నగరంలో నివసించే ప్రజలు మొబైల్, టీవీ , రేడియోలను ఉపయోగించరు. ఈ పరికరాలు ఈ నగరంలో పూర్తిగా నిషేధించబడ్డాయి. ఈ నగరంలో ఈ పరికరాలను ఉపయోగించిన ఒక వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. అంటే ఇక్కడ నివసించే వారు ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది.

Americas quietest town: ఆ నగరంలో స్మార్ట్ ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులు వాడితే జైలుకే..! రీజన్ ఏమిటో తెలిస్తే షాక్..
America's Quietest Town
Follow us on

ప్రస్తుత కాలంలో ఫోన్ లేకుండా జీవితాన్ని ఊహించుకోలేం. అప్పుడే పుట్టిన శిశువు నుంచి కాటికి కాళ్లు చాచిన ముదుసలికి సైతం సెల్ ఫోన్ జీవితంగా మారిపోయింది. మరి అలాంటి పరిస్థితిలో మీరు సెల్ ఫోన్‌ను ఉపయోగించకూడదంటూ నిషేధం చేస్తే.. అసలు ఇది నిజమేనా అని ఆలోచిస్తారు. అయితే సెల్ ఫోన్‌లను ఉపయోగించడంపై నిషేధం ఉన్న నగరం ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ నివసించే ప్రజలు ఫోన్‌లు లేదా ఆధునిక సాంకేతికతను ఉపయోగించరు. ఫోన్‌లు లేకుండా ఏ నగరం నడుస్తోందో.. అక్కడ ఉన్న ప్రజల జీవితం సాధారణంగా ఎలా సాగుతుందో ఈ రోజు తెలుసుకుందాం..

ఎలక్ట్రికల్ పరికరాలను వాడితే జైలు శిక్ష తప్పదు.

అమెరికాలోని ఓ నగరంలో సెల్ ఫోన్ పై నిషేధం అమల్లో ఉంది. వెస్ట్ ఆఫ్ అమెరికాలోని వర్జీనియాలోని పోకాహోంటాస్ కౌంటీలో ఉన్న గ్రీన్ బ్యాంక్ సిటీలోని ప్రజలు సాంకేతికతను ఉపయోగించరు.

మొబైల్, టీవీ , రేడియోను ఉపయోగించడం పై నిషేధం

ఈ నగరంలో నివసించే ప్రజలు మొబైల్, టీవీ , రేడియోలను ఉపయోగించరు. ఈ పరికరాలు ఈ నగరంలో పూర్తిగా నిషేధించబడ్డాయి. ఈ నగరంలో ఈ పరికరాలను ఉపయోగించిన ఒక వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. అంటే ఇక్కడ నివసించే వారు ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

ఎందుకు ఉపయోగించలేరంటే

నిజానికి ప్రపంచంలోనే అతిపెద్ద స్టీరబుల్ రేడియో టెలిస్కోప్ ఈ నగరంలో ఉంది. ఈ ఊరి జనాభా కేవలం 150 మంది మాత్రమే. ఈ గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్ చాలా పెద్దది. దీని పొడవు 485 అడుగులు..  బరువు 7600 మెట్రిక్ టన్నులు. ఈ టెలిస్కోప్ గొప్పదనం ఏమిటంటే టెలిస్కోప్ కదిలే విధంగా ఉంటుంది.. అంటే దీనిని  ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సులభంగా మార్చుకోవచ్చు.

అమెరికా నేషనల్ రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ ఈ స్టీరబుల్ రేడియో టెలిస్కోప్ సమీపంలో ఉంది. ఇక్కడి నుంచి అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చే అలలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.

ఈ టెలిస్కోప్ అంతరిక్షంలో 13 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సంకేతాలను కూడా పట్టుకోగలదు. ఈ నగరంలో ఎలక్ట్రిక్ పరికరం ఉపయోగించకపోవడానికి కారణం ఇదే.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..