Gaza Sitution: ఒక్క బ్రెడ్ ముక్క కోసం 4 గంటలు క్యూ.. ఇది గాజా పరిస్థితి.
గాజాలో ఆకలి కేకలు..కడుపులో మంటలు రేపుతున్న ఆకలి, తాగునీరు కూడా లేక తడారిపోతున్న గొంతులు, ఒక్క రొట్టె ముక్క కోసం నాలుగైదు గంటలపాటు క్యూలెన్లలో గాజవాసుల పడిగాపులు..ప్రస్తుతం గాజాలో కనిపిస్తున్న హృదయవిదారక దృశ్యాలివీ.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం తీవ్రమవుతోంది..హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకీ ఉదృతం అవుతోంది.
గాజాలో ఆకలి కేకలు..కడుపులో మంటలు రేపుతున్న ఆకలి, తాగునీరు కూడా లేక తడారిపోతున్న గొంతులు, ఒక్క రొట్టె ముక్క కోసం నాలుగైదు గంటలపాటు క్యూలెన్లలో గాజవాసుల పడిగాపులు..ప్రస్తుతం గాజాలో కనిపిస్తున్న హృదయవిదారక దృశ్యాలివీ.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం తీవ్రమవుతోంది..హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకీ ఉదృతం అవుతోంది. గాజాలో ఇజ్రాయెల్ దళాలు భూతల దాడులను ఉధృతం చేశాయి. దీంతో గాజాలోని ప్రజలు దేశం విడిచి పారిపోలేక, అక్కడ సురక్షితంగా ఉండలేక దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆహారం, తాగునీరు లేక అల్లాడిపోతున్నారు. మందులు, ఇతర అత్యవసర సామగ్రి లేక దారుణంగా ఉంది వారి పరిస్థితి. ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం మంగళవారం నెల రోజులకు చేరుకుంది. యుద్ధంలో ఇప్పటిదాకా గాజాలో 4,100 మంది చిన్నారులు సహా 10,328 మంది, ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా జనం మరణించారు.గాజా జనాభా 23 లక్షలు కాగా, యుద్ధం మొదలైన తర్వాత 70 శాతం మంది నిరాశ్రయులయ్యారు. ఆహారం, నీరు, ఔషధాలు, నిత్యావసరాలు లేక క్షణమొక యుగంగా కాలం గడుపుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్
ఈ పూజ చేస్తే.. మీ ఇంట కనక వర్షమే.. నగరంలో కేటుగాళ్ల మోసాలు
నిర్మాణంలో ఉన్న శివుని విగ్రహం.. పరీక్షించేందుకు వచ్చిన నాగుపాము!
పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!
ఈ చిన్నారి చిచ్చరపిడుగు.. ఏకంగా విమానాన్నే రద్దు చేయించింది!
Gen Z ప్రేమలో వినిపించే ఈ డేటింగ్ పదాల అసలు అర్థాలివే!

