American Hospital: మనసుకు తెలిసినవారు ఎవరైనా ఆస్పత్రిలో ఉన్నా ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినా మనం దైర్యం చెబుతాం..ఏమీ కాదు.. సర్జరీ సక్సెస్ అవుతుంది. త్వరలోనే ఆస్పత్రినుంచి తిరిగి వచ్చేస్తారంటూ అండగా నిలబడతాం.. అదే మనకు సర్జరీ చేయాల్సిన పరిస్థితి తలెత్తితే,.. చిన్నదైనా పెద్దదైనా సరే భయపడతాం.. ఒకొక్కసారి కొందరు ఆపరేషన్ రూమ్ లోకి వెళ్లేముందు తమ వారిని చూసి.. పెట్టుకోవడం సహజం కూడా.. కొంతమంది అయితే భయంతో గట్టిగా ఏడుచేస్తారు కూడా.. ఇలా ఓ అమ్మాయి ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. దీంతో ఆస్పత్రిలో సర్జరీకి ముందు భయంతో గట్టిగా ఏడ్చేసింది. అయితే ఆ అమ్మాయి అలా ఏడ్చి నందుకు ఆస్పత్రి సిబ్బంది ఊహించని షాక్ ఇచ్చింది. ఆస్పత్రిలో ఏడ్చినందుకు సర్జరీఖర్చులతో కలిపి బిల్లు వేశారు.. ఈ విచిత్ర ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
మిడ్గే అనే అమ్మాయి శస్త్రచికిత్స సమయంలో ఏడ్చినందుకు ఆస్పత్రి సిబ్బంది వసూలు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా ఆస్పత్రి బిల్లు పిక్ ను పోస్ట్ చేసింది. ట్విట్టర్‌లో ఆమె పోస్ట్ చేసిన ఈ బిల్లు ఇప్పుడు అక్కడ పెద్ద సంచలనం సృష్టించింది. అమెరికాలోని హెల్త్‌కేర్ సిస్టమ్ పై అనేక ప్రశ్నలు తలెత్తలా చేసింది. మిడ్గే పుట్టుమచ్చలను మైనర్ సర్జరీ ద్వారా వాటిని తొలగించేందుకు ఆస్పత్రికి వెళ్ళింది. దీంతో డాక్టర్స్ సర్జరీ చేస్తున్న సమయంలో భయంతో మిడ్గే ఏడ్చింది. అయితే వైద్యులు ఆమెకు ధైర్యం చెప్పి పుట్టుమచ్చలు తొలగించారు.
డిశ్చార్జ్ చేసే ముందు మిడ్గే కు షాక్ ఇచ్చార. ఆస్పత్రి సిబ్బంది 223 డాలర్ల బిల్లు వేసింది. అయితే ఆ బిల్లులో ఆమె సర్జరీకి ముందు ఏడ్చినందుకు 11 డాలర్లని ఉంది. బ్రీఫ్ ఎమోషన్’ అన్న పేరుతో బిల్లును వసూలు చేస్తున్నామని బిల్లులో పేర్కొన్నారు. అయితే బంపర్ ఆఫర్ గా ఏడ్చినందుకు బిల్లు అంటే మిడ్గే షాకయ్యింది. భయంతో ఏడ్చినా కూడా బిల్లు వేస్తారా అంటూ ఆశ్చర్యపోయింది. ఆస్పత్రి నిర్వాహకాన్ని ప్రపంచానికి చెప్పాలనకుంది. తన ట్విట్టర్ ఖాతాలో ఆ బిల్లును పోస్టు చేసింది. ఆ బిల్లును చూసి చాలా మంది నెటిజన్లు షాకయ్యారు. క్షణాల్లో ఆమె పోస్టు వైరల్ అయ్యింది. పదిలక్షలకు పైగా లైకులు వచ్చాయి. వేల మంది రీ ట్విట్ చేశారు. ‘అమెరికన్ హెల్త్ కేర్ సిస్టమ్ పరిస్థితి ఇలా ఉంది’ అంటూ నెటిజన్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు వ్యంగంగా స్పందిస్తూ.. ఇప్పుడు ఈ ఆస్పత్రి బిల్లుని చూసి.. మిగతా దేశాలు కూడా బిల్లులు వేయడం ప్రారంభిస్తే.. అసలే కరోనా తో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఇక రోగుల కుటుంబ సభ్యుల పని అయినట్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Mole removal: $223
Crying: extra pic.twitter.com/4FpC3w0cXu— Midge (@mxmclain) September 28, 2021
Also Read: Money Tree in UK: ఆ గ్రామంలో చెట్లకు డబ్బులు .. తీసుకుంటే వ్యాధులు వస్తాయంటున్న స్థానికులు..