లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు.. మంటల్లో బూడిదైన హాలీవుడ్‌ తారల ఆస్తులు.. కోట్ల నష్టం

|

Jan 10, 2025 | 1:02 PM

హాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇక్కడే ఉండటంతో పలు చిత్రాల షూటింగ్స్ వాయిదాపడ్డాయి. చాలా మంది హాలీవుడ్ తారల బంగ్లాలు కాలి బూడిదయ్యాయి. మంగళవారం నాడు చెలరేగిన అగ్నిప్రమాదానికి ఇప్పటి వరకు 3 రోజుల్లో 28 వేల ఎకరాలు దెబ్బతిన్నాయి. దాదాపు 1900 భవనాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. 28 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. హెలికాప్టర్లు, విమానాలతో కాలిఫోర్నియాలో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే

లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు.. మంటల్లో బూడిదైన హాలీవుడ్‌ తారల ఆస్తులు.. కోట్ల నష్టం
Fire In Los Angeles
Follow us on

అమెరికాలోని కాలిఫోర్నియాలో గల లాస్‌ ఏంజిలిస్‌ నగరాన్ని కార్చిచ్చు చుట్టుముట్టింది. అనేక అడవుల్లో వ్యాపించిన మంటలు నివాస ప్రాంతాలను ఆక్రమించుకుంటున్నాయి. ఈ మంటలు హాలీవుడ్‌ హిల్స్‌కు చేరాయి. ప్రపంచంలోని అనేక పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ల స్టూడియోలు ఈ కొండలపై ఉన్నాయి. చాలా మంది హాలీవుడ్ తారలకు కూడా ఈ స్థలంలో ఇళ్లు ఉన్నాయి. కార్చిచ్చు కారణంగా దాదాపు 60 బిలియన్ల (సుమారు రూ.5 లక్షల కోట్లు) ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయినట్టుగా తెలిసింది.. లక్షమందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.

హాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇక్కడే ఉండటంతో పలు చిత్రాల షూటింగ్స్ వాయిదాపడ్డాయి. చాలా మంది హాలీవుడ్ తారల బంగ్లాలు కాలి బూడిదయ్యాయి. పారిస్ హిల్టన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్, మాండీ మూర్, అష్టన్ కుచర్‌తో సహా పలువురు హాలీవుడ్ స్టార్ల ఆస్తులకు నిప్పంటకున్నట్టుగా సమాచారం. అగ్నిప్రమాదం తర్వాత చాలా మంది సెలబ్రిటీలు తమ ఇళ్లను ఖాళీ చేయవలసి వచ్చింది. ఇదొక్కటే కాదు, బ్రెట్టన్‌వుడ్ ప్రాంతంలో నిర్మించిన ఉపాధ్యక్షుడు కమలా హారిస్ ఇంటిని కూడా ఖాళీ చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఇదిలా ఉంటే, కార్చిచ్చు సమాచారంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ఇటలీ పర్యటనను రద్దు చేసుకొని సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

మంగళవారం నాడు చెలరేగిన అగ్నిప్రమాదానికి ఇప్పటి వరకు 3 రోజుల్లో 28 వేల ఎకరాలు దెబ్బతిన్నాయి. దాదాపు 1900 భవనాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. 28 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. హెలికాప్టర్లు, విమానాలతో కాలిఫోర్నియాలో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈదురు గాలుల కారణంగా మంటలు ఎటువైపులా వ్యాపిస్తున్నాయి. దాదాపు 7500 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి