
ఖతార్, ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో భారత విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చి, వెళ్లే తమ అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.తదుపరి ప్రకటన వచ్చే వరకు ఆ నిర్ణయం కొనసాగుతుందని ఎయిర్ ఇండియా తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది. యూరప్‌తో పాటు ఉత్తర అమెరికాలోని తూర్పు తీర ప్రాంతాల్లో ఉన్న పలు నగరాలు, పచ్చిమాసియాలోని పలు దేశాలకు తమ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. అయితే ఇప్పటికే బయల్దేరిన కొన్ని విమానాలను మళ్లిస్తున్నట్టు ఎయిర్ ఇండియా పేర్కొంది.
ఉత్తర అమెరికా నుంచి భారతదేశానికి బయలుదేరిన కొన్ని విమానాలను తిరిగి వెనక్కి పంపినట్టు ఎయిరిండియా పేర్కొంది. అలాగే ఇండియా నుంచి బయలుదేరిన విమానాలను ఇతర మార్గాల్లో వెనక్కి రప్పిస్తున్నట్లు తెలిపింది. తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు తమ ప్రయాణికులకు అప్‌డేట్స్ ఇస్తామని, ప్రయాణికుల క్షేమం, భద్రతే తమకు ముఖ్యమని ఎయిర్ ఇండియా పేర్కొంది.
“Amid the developing situation in the Middle East, Air India has ceased all operations to the region as well as to and from the East Coast of North America and Europe with immediate effect, until further notice. Our India-bound flights from North America are…
— Air India (@airindia) June 23, 2025
ఎయిర్ ఇండియాతో పాటు గల్ఫ్ ప్రాంతం నుంచి ప్రయాణించే ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలు కూడా తమ విమాన సర్వీసులను నిలిపివేసినట్టు తెలుస్తోంది. వాటి మూలాల నుంచి ఇప్పటికే బయలుదేరిన కొన్ని విమానాలను ఇతర మార్గాల్లోకి మళ్లించగా. అంతకుముందు కొచ్చి నుంచి ఖతార్‌లోని దోహాకు బయలుదేరిన ఎయిరిండియా విమానాన్ని మస్కట్‌కు దారి మళ్లించారు.
ఇదిలా ఉండగా పశ్చిమాసియాలో ఉద్రిక్తపరిస్థితుల నేపథ్యంలో దుబాయి, దోహా, బహ్రెయిన్, దామమ్, అబుదాబీ, కువైట్ తిబ్లిసీ నుంచి రాకపోకలు సాగిస్తున్న విమానాలు ఇండిగో విమానాలపై ప్రభావం పడింది. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఇండిగో పేర్కొంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..