Deathbots: వామ్మో..చైనా వాళ్లు మామూలోళ్లు కాదు..చనిపోయినవారితో మాటలు..

| Edited By: Velpula Bharath Rao

Oct 22, 2024 | 12:00 PM

చనిపోయిన మన ఆత్మీయులతో మాట్లాడడం అంటే కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యం. . టెక్నికల్‌గా చైనా దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా చనిపోయిన వ్యక్తి తాలూకా జ్ఞాపకాలను ఆ వ్యక్తి బతికి ఉంటే ఎలా ఉండేదో అచ్చం అలానే డెత్ బోట్‌లను స్పష్టిస్తున్నారు.

Deathbots: వామ్మో..చైనా వాళ్లు మామూలోళ్లు కాదు..చనిపోయినవారితో మాటలు..
Ai Deathbots
Follow us on

చనిపోయిన వ్యక్తి బతికున్న వ్యక్తులకు ఉన్న సమస్యలను తొలగించే వరకు మనతో ఉన్నట్టు ఇలాంటివి మనం సినిమాలు చాలా చూశాం. టెక్నికల్‌గా చైనా దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా చనిపోయిన వ్యక్తి తాలూకా జ్ఞాపకాలను ఆ వ్యక్తి బతికి ఉంటే ఎలా ఉండేదో అచ్చం అలానే డెత్ బోట్‌లను స్పష్టిస్తున్నారు.

చనిపోయిన మన ఆత్మీయులతో మాట్లాడడం అంటే కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యం అనేది ఇప్పటివరకు ఉన్న అభిప్రాయం. కానీ తాజా పరిశోధనతో చైనాకు చెందిన కొన్ని కంపెనీలు ఈ అభిప్రాయాన్ని మార్చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరణించిన వారి రూపంతో డిజిటల్ అవతార్లను ఈ కంపెనీలు అభివృద్ధి చేస్తున్నాయి. వీటికి డెడ్ బోట్ అని పేరు పెట్టాయి. చనిపోయిన వారు జీవించి ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు వీడియోలను ఉపయోగించి ఈ అవతార్లను తయారు చేస్తున్నారు.

ఇవి అచ్చం చనిపోయిన మనిషిలానే మాట్లాడతాయి. ఇటీవల ఈ డెడ్ బోట్లకు చైనాలో ఆదరణ పెరుగుతున్నది. అయితే ఇదే సమయంలో దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక మనిషి మరణించిన తర్వాత కొన్ని రోజులకు సహజంగా వారిని మర్చిపోయే ప్రక్రియకు ఈ డెడ్ బోట్లు ఆటంకంగా మారుతున్నాయని.. మరణించిన మనిషిని మర్చిపోకుండా చేస్తున్నాయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి