మారడోనాకు బదులు పాప్ సింగర్ మడోనాకు నివాళులు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ లు 

|

Nov 27, 2020 | 8:38 AM

లెజెండ్‌ డీగో మారడోనా మరణం అర్జెంటీనాను శోక సంద్రంలోకి నెట్టింది. మారడోనా మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. మారడోనా బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే...

మారడోనాకు బదులు పాప్ సింగర్ మడోనాకు నివాళులు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ లు 
Follow us on

లెజెండ్‌ డీగో మారడోనా మరణం అర్జెంటీనాను శోక సంద్రంలోకి నెట్టింది. మారడోనా మరణాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. మారడోనా బుధవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతికి సంతాపంగా ఫుట్‌బాల్‌ అభిమానులు ఆయనకు నివాళులర్పిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులుపెట్టారు.

అయితే కొందరు మారడోనాను పొరబాటున పాప్‌సింగర్‌ మడోనా అనుకున్నారు. సోషల్ మీడియాలో మడోనాకు నివాళులర్పిస్తూ ఆర్‌ఐపీ పోస్టులు పెట్టారు. ఇద్దరి పేర్లలో కొంచం తేడా ఉండటంతో అభిమానులు పొరపాటున పాప్ సింగర్ మడోనాకు నివాళులు అర్పిస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. ఆ పోస్ట్ లు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా కడసారి చూసేందుకు అభిమానులు పోటెత్తారు. బ్యూనస్‌ ఎయిర్స్‌లోని బోకా జూనియర్స్‌ స్టేడియంలో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచగా అభిమానులు కన్నీరు మున్నీరయ్యారు.