Taliban Warns PAK: పాముకు పాలు పొస్తే ఇలానే ఉంటుంది మరి.. పాకిస్థాన్‌కు వార్నింగ్‌ ఇచ్చిన తాలిబాన్లు..

|

Jan 04, 2023 | 7:43 AM

పాముకి పాలు పోసి పెంచితే కాటేయడం మానేస్తుందా?. పాకిస్తాన్‌కు అదే అనుభవం ఎదురైంది ఇప్పుడు. పాకిస్తాన్‌ పెంచి పోషించిన తాలిబన్లే... ఇప్పుడు ఆ దేశాన్ని కాటేస్తున్నారు. ఏకంగా సమాంతర ప్రభుత్వాన్నే నడుపుతూ సవాలు విసిరారు తాలిబన్లు

Taliban Warns PAK: పాముకు పాలు పొస్తే ఇలానే ఉంటుంది మరి.. పాకిస్థాన్‌కు వార్నింగ్‌ ఇచ్చిన తాలిబాన్లు..
Taliban
Follow us on

తాలిబాన్లు.. పాకిస్తాన్‌కు పక్కలో బల్లెంలా మారుతున్నారు. పాక్‌లో సామాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు తాలిబన్లు. పాముకి పాలు పోస్తే తిరిగి కాటేసిందన్నట్టుగా పాకిస్తాన్‌నే కాటేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్స్‌. ఆఫ్ఘన్‌లో అధికారం చెలాయిస్తోన్న తాలిబన్లు, ఇప్పుడు పాక్‌పై ఫోకస్ పెట్టారు. పాకిస్తాన్‌ను తమ కంట్రోల్‌లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆఫ్ఘన్ తాలిబన్లకు సన్నిహితమైన టీటీపీ ద్వారా పాకిస్తాన్‌లో చెలరేగిపోతోంది. ప్రధాని షెహబాజ్‌ ప్రభుత్వానికి పోటీగా ఉత్తర పాకిస్తాన్‌లో సమాంతర సర్కార్‌ను నెలకొల్పి పాలిస్తోంది. కేవలం ప్రభుత్వాన్నే కాదు.. మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసింది తెహ్రీక్‌ ఇ తాలిబన్ గ్రూప్‌. ఈ పరిణామాలు పాకిస్తాన్ సార్వభౌమత్వాన్నే సవాలు చేయడంతో పాలక వర్గం, సైన్యం డిఫెన్స్‌లో పడ్డాయి. ఎలా ఎదుర్కోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు పాలకులు.

ఒకవైపు ఉత్తర పాకిస్తాన్‌లో ప్రభుత్వాన్ని నడుపుతూనే, మరోవైపు పాక్‌ బోర్డర్‌లో దాడులు చేస్తున్నారు ఆఫ్ఘన్ తాలిబన్లు. తెహ్రీక్‌ ఇ తాలిబన్ పాకిస్తాన్‌ గ్రూప్‌ను టీటీపీగా పిలుస్తారు. ఈ గ్రూప్‌ను పాకిస్తాన్‌ తాలిబన్‌ అని కూడా అంటారు. ఇది ఆఫ్ఘన్‌ తాలిబన్‌కి అనుబంధ సంస్థ. ఈ గ్రూపే ఇప్పుడు ఉత్తర పాకిస్తాన్‌లో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది. దాంతో, షెహబాజ్‌ సర్కారు ఉలిక్కిపడింది. ఆర్మీ ఆఫీషియల్స్‌తో అత్యవసర సమావేశం నిర్వహించి ప్రధాని షెహబాజ్‌ మాట్లాడారు.

ఈ మీటింగ్‌ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌పై హాట్‌ కామెంట్స్‌ చేశారు పాక్ హోంమంత్రి రాణా సనావుల్లా. పాకిస్తాన్‌ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తే, ఆఫ్ఘన్‌లోకి చొచ్చుకొచ్చిమరీ దాడి చేస్తామని హెచ్చరించారు. ఈ ప్రకటనతో మరింత చెలరేగిపోతున్నారు తాలిబన్లు.

ఇవి కూడా చదవండి

1971లో భారత్‌ చేతిలో ఎదురైన అవమానమే ఈసారి తమ నుంచి ఎదురవుతుందని హెచ్చరిస్తున్నారు. దాంతో, పాకిస్తాన్‌ పరువు పోయినంత పనైంది. మరి, టీటీపీ సమారంత సర్కార్‌పై షెహబాజ్‌ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో? కట్టడికి ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందో చూడాల్సి ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..