Afghanistan Taliban: అప్పుడే మొదలైన తాలిబాన్ల అరాచకాలు.. కోరికలు తీర్చుకునేందుకు బాలికల కోసం చిత్తకార్తె కుక్కల్లా..

|

Aug 13, 2021 | 1:49 PM

Afghanistan Taliban: ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్ల హింస రోజురోజుకు తీవ్రస్థాయికి చేరుతోంది. అఫ్ఘాన్‌ భూభాగాల నుంచి అమెరికా సైన్యం వైదొలిగిన అనంతరం

Afghanistan Taliban: అప్పుడే మొదలైన తాలిబాన్ల అరాచకాలు.. కోరికలు తీర్చుకునేందుకు బాలికల కోసం చిత్తకార్తె కుక్కల్లా..
Afghan Taliban
Follow us on

Afghanistan Taliban: ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్ల హింస రోజురోజుకు తీవ్రస్థాయికి చేరుతోంది. అఫ్ఘాన్‌ భూభాగాల నుంచి అమెరికా సైన్యం వైదొలిగిన అనంతరం తాలిబాన్లు ఇప్పటికే పలు కీలక భూభాగాలను ఆక్రమించారు. ఈ క్రమంలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ వైపు ఆఫ్ఘాన్ సైన్యంపై తాలిబాన్ ఉగ్రవాదులు దాడి కొనసాగిస్తునే.. మరోవైపు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. రాడికల్ ఇస్లామిక్ తీవ్రవాదులు ఇప్పుడు 12 ఏళ్లలోపు బాలికలను బలవంతంగా పెళ్లి చేసుకుని.. వారిని లైంగిక బానిసత్వంలోకి నెట్టడానికి ఇంటింటికీ తిరుగుతున్నారు.

అంతర్జాతీయ మీడియా వెల్లడించిన ప్రకారం.. తాలిబాన్ ఉగ్రవాదులు ఇప్పటికే కొన్ని ప్రావిన్షియల్ రాజధానులను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లో తాలిబాన్లను వివాహం చేసుకోవడానికి 12 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల అవివాహిత మహిళల జాబితాలను తీసుకురావాలని స్థానిక ఇమామ్‌లను ఆదేశించారు. దీంతోపాటు.. వయసుకనుగుణంగా.. తాలిబాన్లు మహిళలను విభజించుకోవాలని ప్రాణాళికలు చేసుకుంటున్నారు. తాలిబాన్ కమాండర్ల ఆదేశాల మేరకు.. తీవ్రవాదులు ఇంటింటికి వెళుతూ.. బాలికల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇళ్లల్లోకి సైతం ప్రవేశిస్తున్నారని అంతర్జాతీయ మీడియా తెలిపింది.

కాగా.. తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో కఠినమైన షరియా చట్టాలను అమలు చేస్తున్నారు. కమాండర్ల అనుమతి లేకుండా మహిళలు పాఠశాలలకు వెళ్లడం కానీ.. పని చేయడం కానీ, ఇళ్ల నుంచి బయటకు వెళ్లడం లాంటి వాటిని నిషేధించారు. దీంతోపాటు ఆప్ఘాన్ ప్రజలు తమ పిల్లలను తాలిబాన్లకు ఇచ్చి పెళ్లి చేయాలని హుకూం జారీ చేశారు. దీంతో ఆ దేశంలో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. తాలిబాన్ల పాలన మొదలైతే ఇంకా ఎన్ని అరాచకాలు మొదలవుతాయో అంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

గురువారం ఆప్ఘాన్ రాజధాని కాబూల్‌ నగరానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్నీ పట్టణాన్ని కూడా వశపరుచుకున్న తాలిబన్లు.. శుక్రవారం కందహార్ పట్టణాన్ని సైతం పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఆఫ్ఘానిస్థాన్‌లోని 34 ప్రొవిన్షియల్ రాజధానులల్లో 12 కీలక ప్రాంతాలను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు.

Also Read:

Talibans: ఆప్ఘానిస్థాన్‌లో కొనసాగుతున్న హింస.. తాలిబన్ల గుప్పిట్లోకి కాందహార్‌‌ నగరం..

‘మూడు నెలల్లోగా కాబూల్ నగరాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవచ్చు.’ యూఎస్ ఇంటెలిజెన్సీ వర్గాలు