Taliban in Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ పాలనకు వంద రోజులు.. ఆకలి కేకలు.. పారిపోతున్న ప్రజలు.. ఇదీ ప్రస్తుత పరిస్థితి!

|

Nov 25, 2021 | 1:56 PM

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌ పాలన ప్రారంభమై 100 రోజులు పూర్తయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో గతంలో పరిస్థితి దారుణంగా ఉంటే, ఇప్పుడు మరింత దారుణంగా మారింది. ఇక్కడ కొనసాగుతున్న సంక్షోభం విషాదంగా మారే దశకు చేరుకుంది.

Taliban in Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ పాలనకు వంద రోజులు.. ఆకలి కేకలు.. పారిపోతున్న ప్రజలు.. ఇదీ ప్రస్తుత పరిస్థితి!
Afghanistan Taliban
Follow us on

Taliban in Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌ పాలన ప్రారంభమై 100 రోజులు పూర్తయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో గతంలో పరిస్థితి దారుణంగా ఉంటే, ఇప్పుడు మరింత దారుణంగా మారింది. ఇక్కడ కొనసాగుతున్న సంక్షోభం విషాదంగా మారే దశకు చేరుకుంది. ఆర్థిక వ్యవస్థ పతనమై పెద్ద సంఖ్యలో ప్రజలు దేశం విడిచి పారిపోతున్నారు. ఐక్యరాజ్యసమితి ఆఫ్ఘనిస్తాన్‌లో ఆకలి, కరువు గురించి హెచ్చరించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి ఎలా ఉందో మీడియా ప్రపంచానికి వెల్లడించింది. ఈ క్రమంలో అక్కడ స్థానికులు చెప్పిన విషయాలు ఆందోళనకరంగా ఉన్నాయి.

తాలిబాన్‌లు కాబూల్‌లో 100 రోజులు పూర్తి చేసుకున్నారు. అయితే వారు అంతకు ముందే మా వద్దకు వచ్చారు. ఇంతకుముందు కూడా మాకు జీవితం అంత సుఖవంతం ఏమీ కాదు. కానీ, ఇప్పుడు మాజీవితాలు మరింత కష్టంగా మారాయి. ప్రతిరోజూ పోరాటంగా మారింది. పిల్లల చదువులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక బాలికల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. వారు పూర్తిగా ఇంటిలో బందీలుగా మారిపోయారు. అక్కడ 19 ఏళ్ల బాలిక మీడియాతో మాట్లాడుతూ ”నేను ఇంకా చదవాలనుకున్నాను. ఈసారి యూనివర్శిటీలో నా రెండవ సంవత్సరం, కానీ నేను నా చదువును కోల్పోయాను. నేను నా ఇంట్లో బందీ అయిపోయాను. గత వందరోజుల్లో ఇంటి గుమ్మం నుంచి బయటకు రాలేదు, నా నగర వీధులు చూడలేదు.” అంటూ చెప్పింది. ఇదొక్కటి చాలు ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితిని వివరించడానికి.
ఇక ఆఫ్ఘనిస్తాన్ లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయని మీడియా చెబుతోంది. దేశం విడిచి పారిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. మరో పక్క ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది.

ఇవి కూడా చదవండి: Weight Loss: బరువు తగ్గాలని కడుపు మాడ్చుకుంటే ప్రయోజనం లేదు.. ఆహారాన్ని ఇలా తీసుకోవడం ద్వారా కూడా సన్నపడవచ్చు..

Air Purifiers for home: ఇంటిలో గాలిని స్వచ్చంగా మార్చే ప్యూరిఫైయర్స్.. పనితీరులో అత్యధిక రేటింగ్ ఉన్నవి ఏమిటో తెలుసుకోండి!

Mysterious Stone: బంగారం కోసం వెతికితే పెద్ద రాయి దొరికింది.. అదేమిటో తెలుసుకుని అవాక్కయ్యాడు!