India help to Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌కు చేరిన భారత్ మెడిసిన్స్.. తాలిబన్ల ధన్యవాదాలు.. ఈ సహాయంపై వారెమన్నారంటే..

భారతదేశం ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌కు 1.6 మెట్రిక్ టన్నుల ప్రాణాలను రక్షించే మెడిసిన్స్ ఇతర సామాగ్రి పంపింది.

India help to Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌కు చేరిన భారత్ మెడిసిన్స్.. తాలిబన్ల ధన్యవాదాలు.. ఈ సహాయంపై వారెమన్నారంటే..
India Help To Afghanistan

Updated on: Dec 12, 2021 | 6:04 PM

India help to Afghanistan: భారతదేశం ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌కు 1.6 మెట్రిక్ టన్నుల ప్రాణాలను రక్షించే మెడిసిన్స్ ఇతర సామాగ్రి పంపింది. భారత్ చేసిన ఈ సహాయంపై తాలిబన్లు తమ ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా భారత్-ఆప్ఘన్ దేశాల మధ్య సంబంధం చాలా ముఖ్యమైనది. ఈ సాయాన్ని శనివారం న్యూఢిల్లీ నుంచి కాబూల్‌కు ప్రత్యేక విమానంలో పంపారు. ఈ క్లిష్ట సమయంలో అనేక ఆఫ్ఘన్ కుటుంబాలకు ఈ భారత్ సహాయం చేస్తుందని భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్ రాయబారి ఫరీద్ మముంద్‌జాయ్ ట్విట్టర్‌లో తెలిపారు.

ఫరీద్ మముంద్జే మాట్లాడుతూ, ‘పిల్లలకు కావలసిందల్లా ఒక చిన్న సహాయం, ఒక చిన్న ఆశ.. వారిని నమ్మే వ్యక్తి. భారతదేశం నుండి మొదటి వైద్య సహాయం ఈ ఉదయం కాబూల్ చేరుకుంది. 1.6 MT ప్రాణాలను రక్షించే మందులు ఈ కష్ట సమయంలో అనేక కుటుంబాలకు సహాయం చేస్తాయి. భారతదేశ ప్రజల నుండి ఇది అఫ్ఘన్ పౌరులకు బహుమతి.’ అన్నారు. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ (ఐఈఏ) డిప్యూటీ అధికార ప్రతినిధి అహ్మదుల్లా వాసిక్ శనివారం ఒక ట్వీట్‌లో, ‘ఈ ప్రాంతంలో భారతదేశం అగ్రగామి దేశం. ఆఫ్ఘనిస్థాన్-భారత్ సంబంధాలు చాలా ముఖ్యమైనవి.’ అని పేర్కొన్నారు.

ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతీయులను తీసుకువచ్చిన విమానంలోనే..

ఆఫ్ఘనిస్తాన్‌లో సవాలుగా ఉన్న మానవతా పరిస్థితుల దృష్ట్యా, భారత ప్రభుత్వం తిరిగి విమానంలో వైద్య సామాగ్రిని పంపినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిన్న తెలిపింది. ఈ విమానం ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరలించిన  భారతీయులను తీసుకువచ్చింది. శుక్రవారం భారతదేశం నిర్వహించిన తరలింపు మిషన్‌లో భాగంగా ఆపరేషన్ దేవి శక్తి కింద ప్రత్యేక విమానంలో హిందూ-సిక్కు మైనారిటీ కమ్యూనిటీ సభ్యులతో సహా 10 మంది భారతీయులు, 94 మంది ఆఫ్ఘన్‌లను ఆఫ్ఘనిస్తాన్ నుండి దేశ రాజధాని ఢిల్లీకి తీసుకువచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. .

‘ఆపరేషన్ దేవి శక్తి’ కింద 669 మంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు

‘ఆపరేషన్ దేవి శక్తి’ కింద ఇప్పటివరకు మొత్తం 669 మందిని ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరలించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో ఆఫ్ఘన్ హిందూ/సిక్కు మైనారిటీ కమ్యూనిటీ సభ్యులతో సహా వందలాది మంది భారతీయులు, ఆఫ్ఘన్‌లు ఉన్నారు. ఆగస్టు 2021 నెలలో, 438 మంది భారతీయులతో సహా 565 మందిని ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరలించారు. తాలిబాన్‌లు అప్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్నప్పటి నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోతున్నారు. అయితే, తాలిబన్లు ఇప్పుడు దేశం విడిచి వెళ్లవద్దని ప్రజలను కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి: America Hurricane: విరుచుకుపడిన హరికేన్లతో అమెరికాలో ఆరు రాష్ట్రాలు అతలాకుతలం.. ఫోటోలలో తుపాను విధ్వంసం చూడండి!